IND vs BAN : పూజల ఫలితం దక్కిందోచ్..! బ్యాట్, హెల్మెంట్‌కు పంత్ పూజలు.. ఎందుకో తెలుసా?
మ్యాచ్ ప్రారంభానికి ముందు చాలా మంది ప్లేయర్లు మైదానంకు మొక్కి లోపలికి వస్తుంటారు. కానీ, భారత్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మాత్రం ..

Rishabh Pant
Rishabh Pant Viral Video : భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య చెన్నై వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు విజయం దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ జట్టు 149 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో తొలి, రెండో ఇన్నింగ్స్ లలో కలిపి 515 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. నాల్గోరోజు వర్షం అంతరాయం కలిగించకుంటే టీమిండియా విజయం ఖాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలాఉంటే.. మూడోరోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ చేసిన పనికి అందరూ ఆశ్చర్య పోతున్నారు.
Also Read : IND vs BAN 1st Test : సెంచరీలతో సత్తాచాటిన గిల్, పంత్.. బంగ్లా ముందు భారీ టార్గెట్
మ్యాచ్ ప్రారంభానికి ముందు చాలా మంది ప్లేయర్లు మైదానంకు మొక్కి లోపలికి వస్తుంటారు. కానీ, భారత్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మాత్రం బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు మ్యాచ్ సందర్భంగా అందరూ ఆశ్చర్యపోయేలా ఓ పనిచేశారు. బంగ్లాతో టెస్ట్ మ్యాచ్ లో భాగంగా మూడోరోజు ఆట ప్రారంభంలో బ్యాటింగ్ కు వచ్చే సమయంలో రిషబ్ పంత్ డ్రెస్సింగ్ రూమ్ లోనే ప్రార్థనలు చేశాడు. పంత్ ప్రార్థనలు చేసింది దేవుడి చిత్రపటానికి కాదు.. తన బ్యాట్, గ్లవ్స్, హెల్మెంట్ కు ప్రార్థనలు చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. భారత్ నుంచి 10వ బౌలర్..
ఓ టేబుల్ పై బ్యాట్, గ్లవ్స్, హెల్మెంట్, పక్కనే బ్యాట్ ను ఉంచి.. వాటికి పంత్ రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు. అయితే, ఆ ప్రార్థనలు కలిసొచ్చినట్లున్నాయి.. మూడో రోజు ఆటలో పంత్ బ్యాట్ తో అదరగొట్టాడు. 109 పరుగులతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంత్ సుదీర్ఘ కాలం తరువాత టెస్టు ఫార్మాట్ లో ఆడుతున్నాడు. 2022లో పంత్ కారు ప్రమాదానికి గురి కావటంతో సుదీర్ఘకాలం క్రికెట్ కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి మళ్లీ మైదానంలో కి అడుగుపెట్టిన పంత్.. శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే మ్యాచ్ లో టీమిండియా జట్టులోకి మళ్లీ తిరిగివచ్చాడు. తాజాగా సుదీర్ఘ విరామం తరువాత బంగ్లాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి పంత్ పునరాగమనం చేశాడు.

Rishabh pant