Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. భారత్ నుంచి 10వ బౌలర్..
2018లో టెస్టుల్లో బుమ్రా అరంగ్రేటం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో అద్భుత ప్రదర్శనలు చేస్తూ అన్ని ఫార్మాట్లలో ఆడగల సామర్థ్యం ఉన్న ఆటగాడిగా నిలిచాడు.

Jasprit Bumrah
Jasprit Bumrah 400 Wickets : భారత్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బమ్రా మరోసారి మైదానంలో అద్భుతాలు చేశాడు. టీ20 ప్రపంచ కప్ లో అద్భుత బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన బుమ్రా.. టెస్ట్ క్రికెట్ లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ తో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 11 ఓవర్లు వేసి నాలుగు వికెట్లను బుమ్రా పడగొట్టాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో 400 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరిపోయాడు.
Also Read : IND vs BAN : కోహ్లీ అలా ఎందుకు చేయలేదు.. రోహిత్ శర్మ ఆగ్రహం..
బుమ్రా మొత్తం 196 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడి 401 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ మ్యాచ్ లలో 37 మ్యాచ్ లు 69 ఇన్నింగ్స్ లు ఆడి.. 163 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో.. 89 మ్యాచ్ లు ఆడిన బుమ్రా 149 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 ఫార్మాట్ లో 70 మ్యాచ్ లు ఆడిన బుమ్రా 89 వికెట్లు పడగొట్టాడు. 400 అంతర్జాతీయ వికెట్లు మైలురాయిని చేరుకున్న 10వ భారత్ బౌలర్ గా బుమ్రా నిలిచాడు.
2018లో టెస్టుల్లో బుమ్రా అరంగ్రేటం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో అద్భుత ప్రదర్శనలు చేస్తూ అన్ని ఫార్మాట్లలో ఆడగల సామర్థ్యం ఉన్న ఆటగాడిగా నిలిచాడు. ఆ తరువాత టెస్టుల్లో కీలక పేసర్ గా జట్టులో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో 19 వికెట్లు తీసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
Also Read : AFG vs SA: అఫ్గానిస్థాన్ జట్టు మరో సంచలన విజయం.. రెండో వన్డేలోనూ సఫారీ జట్టుకు తప్పని ఓటమి
అంతర్జాతీయ క్రికెట్ లో 400 వికెట్ల క్లబ్ లో చేరిన వారిలో బుమ్రా కంటే మరో తొమ్మిది మంది భారత్ బౌలర్లు ముందు వరుసలో ఉన్నారు. వారిలో తొలి స్థానంలో అనిల్ కుంబ్లే (953వికెట్లు), రవిచంద్ర అశ్విన్ (744 వికెట్లు), హర్భజన్ సింగ్ (707) వికెట్లు, కపిల్ దేవ్ (687 వికెట్లు), జహీర్ ఖాన్ (597 వికెట్లు), రవీంద్ర జడేజా (570 వికెట్లు), జావగల్ శ్రీనాథ్ ( 551 వికెట్లు), మహ్మద్ షమీ (448 వికెట్లు), ఇషాంత్ శర్మ (434 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (401 వికెట్లు).