AFG vs SA: అఫ్గానిస్థాన్ జట్టు మరో సంచలన విజయం.. రెండో వన్డేలోనూ సఫారీ జట్టుకు తప్పని ఓటమి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జాలో దక్షిణాఫ్రికా వర్సెస్ అఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరుగుతుంది. శక్రవారం జరిగిన రెండో మ్యాచ్ లో..

Afghanistan vs South Africa
Rahmanullah Gurbaz Century Celebration: ఆఫ్ఘనిస్థాన్ జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా జట్టుపై వరుసగా రెండో వన్డేలోనూ విజయం సాధించింది. తద్వారా తొలిసారి ఆ జట్టు వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. అఫ్గాన్ ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్బుత ప్రతిభ కనబర్చారు. తద్వారా వందకుపైగా పరుగుల తేడాతో సఫారీ జట్టు ఓటమి చవిచూసింది. అఫ్గానిస్థాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ దక్షిణాఫ్రికాతో సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ కు దూరమయ్యాడు. రెండో మ్యాచ్ లో ఆడి ఐదు వికెట్లు తీశాడు. అఫ్గానిస్థాన్ జట్టు సంచలన విజయంతో ఆ జట్టు ప్లేయర్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జాలో దక్షిణాఫ్రికా వర్సెస్ అఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరుగుతుంది. తొలి మ్యాచ్ లో అఫ్గాన్ జట్టు విజయం సాధించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన రెండో మ్యాచ్ లోనూ సఫారీ జట్టుపై అఫ్గాన్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే తొలిసారి వన్డే సిరీస్ ను అఫ్గాన్ జట్టు కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన అఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 311 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ 105 పరుగులు చేశాడు.
312 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు 35 ఓవర్లలో కేవలం 134 పరుగులకు ఆలౌట్ అయింది. అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ అద్భుత బౌలింగ్ వేశాడు. కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. మరో స్పిన్నర్ నంగేయాలియా ఖరోటే నాలుగు వికెట్లు తీశాడు. దీంతో రెండో వన్డేలో 117 పరుగుల తేడాతో అఫ్గాన్ పై సఫారీ జట్టు ఓటమి పాలైంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే అఫ్గాన్ సిరీస్ కైవసం చేసుకుంది. ఈ నెల 22న ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఈ వన్డేలోనూ అప్గాన్ విజయం సాధిస్తే సిరీస్ ను క్లీన్ చేసినట్లవుతుంది.