IND vs BAN : కోహ్లీ అలా ఎందుకు చేయలేదు.. రోహిత్ శర్మ ఆగ్రహం..

కోహ్లీ ఎందుకు డీఆర్ఎస్ తీసుకోలేదని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎల్బీ డబ్ల్యూ విషయంలో ప్రతీసారి డీఆర్ఎస్ తీసుకునే కోహ్లీ.. ఈసారి ఎందుకు తీసుకోలేదని

IND vs BAN : కోహ్లీ అలా ఎందుకు చేయలేదు.. రోహిత్ శర్మ ఆగ్రహం..

Virat Kohli LBW

Updated On : September 21, 2024 / 8:31 AM IST

Rohit Sharma – Virat Kohli : ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా చెన్నైలో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ పై భారత్ పట్టు సాధించంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 376 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ జట్టు కేవలం 149 పరుగులకే ఆలౌట్ అయింది. మళ్లీ భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగుల చేసింది. దీంతో 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే, రెండో రోజు మ్యాచ్ లో కోహ్లీపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : AFG vs SA: అఫ్గానిస్థాన్ జట్టు మరో సంచలన విజయం.. రెండో వన్డేలోనూ సఫారీ జట్టుకు తప్పని ఓటమి

బంగ్లాతో టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ కేవలం ఆరు పరుగులకే అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 17 పరుగులు మాత్రమే చేసి కోహ్లీ అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ క్రీజులో కుదురుకునేలా కనిపించాడు. కానీ స్పిన్నర్ మెహిదీ హసన్ వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్ రెండో బంతిని ఫ్లిక్ చేసేందుకు కోహ్లీ ముందుకు వంగాడు. కానీ, బంతి తక్కువ ఎత్తులో వెళ్లి ప్యాడ్ ను తాకింది. బంగ్లా ఆటగాళ్లు అంపైర్ ను అప్పీల్ చేయగా.. అంపైర్ రిచర్డ్ ఔట్ గా ప్రకటించాడు. డీఆర్ఎస్ తీసుకోమని శుభ్ మన్ గిల్ చెప్పినా కోహ్లీ వినిపించుకోకుండా పెవిలియన్ కు చేరాడు. అయితే, రీప్లేలో బంతి బ్యాట్ ను తాకినట్లు స్పష్టమైంది. ఈ వీడియోను చూసి రోహిత్ శర్మ షాకయ్యాడు. తీవ్ర అసహనానికి గురయ్యాడు. రివ్యూ తీసుకోవాల్సింది కదా అంటూ కోహ్లీపై రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Also Read : IND vs BAN : చెపాక్‌లో అశ్విన్ సెంచ‌రీ.. బామ్మ చేసిన ప‌నికి అంతా షాక్‌?

అయితే, కోహ్లీ ఎందుకు డీఆర్ఎస్ తీసుకోలేదని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎల్బీ డబ్ల్యూ విషయంలో ప్రతీసారి డీఆర్ఎస్ తీసుకునే కోహ్లీ.. ఈసారి ఎందుకు తీసుకోలేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే, కొందరు నెటిజన్లు కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు భయపడే కోహ్లీ రివ్యూ తీసుకోలేదని సెటైర్లు పేల్చుతున్నారు.