IND vs BAN : చెపాక్‌లో అశ్విన్ సెంచరీ.. బామ్మ చేసిన పనికి అంతా షాక్?
బంగ్లాదేశ్‌తో చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది.

Elderly Lady In Stands Celebrates Ashwins Century
Chepauk test : బంగ్లాదేశ్‌తో చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం అయ్యారు. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో దుమ్ములేపాడు. 133 బంతులు ఎదుర్కొన్న అతడు 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. టెస్టుల్లో అశ్విన్‌కు ఇది ఆరో సెంచరీ కాగా.. చెపాక్ మైదానంలో రెండోది.
144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును జడేజా(86)తో కలిసి అశ్విన్ ఆదుకున్నాడు. ఈ క్రమంలో అశ్విన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే.. అశ్విన్ సెంచరీ చేసిన తరువాత అతడు అభివాదం చేసిన సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లోని భారత ఆటగాళ్లతో పాటు మైదానంలోని ప్రేక్షకులు స్టాండింగ్ ఓవెషన్‌లో అభినందనలు తెలియజేశారు.
కాగా.. ఓ బామ్మకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తన చేతుల్లో రెండు కాఫీ కప్పులను పట్టుకుని ఉన్నా కూడా చప్పట్లతో అశ్విన్‌ను అభినందించింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (13), లిటన్ దాస్ (16) లు క్రీజులో ఉన్నారు.
IPL 2025 : ఐపీఎల్ 2025 మెగా వేలానికి డేట్ ఫిక్స్!.. ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్ టెన్షన్?
An applause for @ashwinravi99 across ages! 👏👏
Live – https://t.co/jV4wK7BgV2… #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/SsE9w5VV4u
— BCCI (@BCCI) September 19, 2024