IPL 2025 : ఐపీఎల్ 2025 మెగా వేలానికి డేట్ ఫిక్స్!.. ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్ టెన్షన్?
క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.

IPL 2025 auction to be held outside India in November
IPL Mega Auction : క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో మెగా వేలాన్ని నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. విదేశాల్లోనే వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. సౌదీ అరేబియా వేదికగా వేలం జరిగే అవకాశం ఉంది. గతసారి వేలాన్ని దుబాయ్ వేదికగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను నవంబర్ 15 వరకు సమర్పించాలని బీసీసీఐ డెడ్‌లైన్ విధించినట్లుగా సమాచారం. రిటైన్షన్ ప్లేయర్ల పరిమితి, రైట్ టూ మ్యాచ్ కార్డ్, రిటైర్‌మెంట్ ప్లేయర్లకు సంబంధించిన విధివిధానాలు, ఫ్రాంచైజీల పర్స్ వ్యాల్యూను పెంచడం, ఓ ఓవర్‌లో రెండు బౌన్సర్లకు అనుమతి, ఇంపాక్ట్ ప్లేయర్ వంటి రూల్స్ పై ఈ నెలాఖరులోగా బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో ఎవరెవరిని రిటైన్ చేసుకోవాలనే విషయం పై ఫ్రాంచైజీలు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే అన్ని జట్లు మెగా వేలానికి సన్నద్ధం అయ్యాయి. ప్రస్తుతం తమ కోచింగ్ స్టాఫ్‌ను మార్చే పనిలో ఉన్నాయి. టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్‌కు హెడ్ కోచ్‌గా వెళ్లగా, ఢిల్లీ క్యాపిటల్స్ వద్దుకున్న రికీ పాంటింగ్‌ను పంజాబ్ కింగ్స్ తమ హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఈ క్రమంలో ఈ దిగ్గజ ఆటగాళ్ల హెడ్ కోచ్‌గా ఎలాంటి ఫలితాలను సాధిస్తారో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ముఖ్యంగా టీమ్ఇండియాకు ప్రపంచకప్‌ను అందించిన ద్రవిడ్, రాజస్థాన్‌కు ఐపీఎల్ టైటిల్‌ను అందించాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.