IND vs BAN : బంగ్లాతో తొలి టెస్ట్.. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన కీలక ప్లేయర్

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా గురువారం ఉదయం తొలి మ్యాచ్ ప్రారంభమైంది. చెన్నైలోని ..

IND vs BAN : బంగ్లాతో తొలి టెస్ట్.. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన కీలక ప్లేయర్

IND vs BAN 1st Test

Updated On : September 19, 2024 / 10:03 AM IST

India vs Bangladesh : భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా గురువారం ఉదయం తొలి మ్యాచ్ ప్రారంభమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన బంగ్లా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, జైస్వాల్ క్రీజులోకి వచ్చారు.

Also Read : మేమింతే మారం..! సహనం కోల్పోయి బ్యాట్‌తో బలంగా కొట్టిన పాక్ ప్లేయర్.. వీడియో వైరల్

ఇటీవలే పాకిస్థాన్ ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న బంగ్లాదేశ్ జట్టు భారత్ జట్టుపై పైచేయి సాధించి సంచలనం సృష్టించేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకునేందుకు మార్గం సుగమం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇదిలాఉంటే.. సుదీర్ఘ విరామం తరువాత భారత్ టెస్టు జట్టులోకి యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీ ఇచ్చారు. 2022 డిసెంబర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ గాయపడ్డాడు. అతని మోకాలికి తీవ్ర గాయం కావటంతో శస్త్రచికిత్స జరిగింది. దీంతో సుదీర్ఘకాలం క్రికెట్ కూ దూరంగా ఉన్నాడు. గత ఐపీఎల్ టోర్నీ ద్వారా మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్.. తరువాత శ్రీలంక పర్యటనలో భారత్ జట్టులో చోటుదక్కించుకొని టీ20, వన్డేల్లో ఆడాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టుతో జరిగే టెస్టు మ్యాచ్ ద్వారా సుదీర్ఘ విరామం తరువాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.

Also Read : IPL 2025 : పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్‌.. ఢిల్లీ పొమ్మంటే..

తుది జట్ల వివరాలు ఇలా..
భారత్ జట్టు : రోహిత్ శర్మ(సి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్(సీ), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్

బంగ్లాదేశ్ జట్టు : షాద్‌మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్(w), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహిద్ రాణా