IND vs BAN : చెపాక్ టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్‌ 376 ఆలౌట్‌.. మొద‌టి ఓవ‌ర్‌లోనే వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్‌..

చెన్నైలోని చెపాక్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 376 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

IND vs BAN : చెపాక్ టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్‌ 376 ఆలౌట్‌.. మొద‌టి ఓవ‌ర్‌లోనే వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్‌..

IND vs BAN 1st Test

Updated On : September 20, 2024 / 11:15 AM IST

IND vs BAN 1st Test : చెన్నైలోని చెపాక్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 376 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త బ్యాట‌ర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ (113; 133 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగాడు. ర‌వీంద్ర జడేజా (86; 124 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), య‌శ‌స్వి జైస్వాల్ (56; 118 బంతుల్లో 9 ఫోర్లు) లు హాఫ్ సాధించారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో హ‌స‌న్ మ‌హ‌మూద్ 5 వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. నహిద్ రానా, మెహిదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ సాధించారు.

ఓవ‌ర్‌నైట్ స్కోరు 339/6తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన భార‌త్ మ‌రో 37 ప‌రుగులు మాత్ర‌మే జోడించి మిగిలిన నాలుగు వికెట్ల‌ను కోల్పోయింది. రెండో రోజు ఆట ఆరంభమైన మూడో ఓవ‌ర్‌లోనే బంగ్లాదేశ్‌కు వికెట్ ల‌భించింది.

Ind vs Ban 1st Test: అశ్విన్ సెంచరీ తరువాత రోహిత్, కోహ్లీ, గంభీర్ ఏం చేశారో తెలుసా.. వీడియో వైరల్

ఓవ‌ర్ నైట్ స్కోరుకు మ‌రో ప‌రుగు కూడా జ‌త చేయ‌కుండానే త‌స్కిన్ అహ్మ‌ద్ కు జ‌డేజా చిక్కాడు. ఆకాశ్ దీప్ (17) కాసేపు పోరాడాడు. మ‌రోసారి విజృంభించిన త‌స్కిన్ త‌న వ‌రుస ఓవ‌ర్ల‌లో ఆకాశ్ దీప్‌తో పాటు అశ్విన్‌ను పెవిలియ‌న్‌కు చేర్చాడు. బుమ్రా(7)ను హ‌స‌న్ మ‌హ‌మూద్ ఔట్ చేయ‌డంతో భార‌త ఇన్నింగ్స్ ముగిసింది.

తొలి ఓవ‌ర్‌లోనే వికెట్‌..

భార‌త్‌ను ఆలౌట్ చేశామ‌న్న ఆనందం కాసేపైన బంగ్లాదేశ్‌కు లేకుండా పోయింది. మొద‌టి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాదేశ్‌కు బుమ్రా తొలి ఓవ‌ర్‌నే షాకిచ్చాడు. తొలి ఓవ‌ర్ ఆఖ‌రి బంతికి షాద్మాన్ ఇస్లాం (2)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 3 ఓవ‌ర్లకు బంగ్లాదేశ్ స్కోరు 8/1గా ఉంది. నజ్ముల్ హుస్సేన్ శాంటో (4), జాకీర్ హసన్ (2) క్రీజులో ఉన్నారు.

Ravichandran Ashwin : బంగ్లాదేశ్ పై సెంచ‌రీ.. ర‌విచంద్ర‌న్ అశ్విన్ కామెంట్స్‌.. ఈ శ‌త‌కం..