Ravichandran Ashwin : బంగ్లాదేశ్ పై సెంచరీ.. రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్.. ఈ శతకం..
చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో రవిచంద్రన్ అశ్విన్ శతకంతో చెలరేగాడు.

Ravichandran Ashwin comments after he got century on day 1 against bangladesh
Ashwin century : చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో రవిచంద్రన్ అశ్విన్ శతకంతో చెలరేగాడు. 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి అడుగుపెట్టిన అశ్విన్ మెరుపు శతకాన్ని సాధించాడు. రవీంద్రజడేజాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ను పటిష్ట స్థితిలోకి తీసుకువచ్చాడు. 80 ఓవర్లలో టీమ్ఇండియా 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ (102 నాటౌట్ ; 112 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు ), రవీంద్ర జడేజా (86 నాటౌట్ ; 117 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో అశ్విన్ 108 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. హోం గ్రౌండ్‌లో అభిమానుల మధ్య టెస్టుల్లో ఆరో శతకాన్ని సాధించాడు. ఇక హోం గ్రౌండ్‌లో ఇది అతడికి రెండో శతకం కావడం గమనార్హం. ఇక మ్యాచ్ అనంతరం అశ్విన్ మాట్లాడుతూ.. హోం గ్రౌండ్‌లో సెంచరీ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.
IND vs BAN 1st Test : శతక్కొట్టిన అశ్విన్, జడేజా హాఫ్ సెంచరీ.. తొలి రోజే 330 దాటిన భారత స్కోరు
హోం గ్రౌండ్‌లో ప్రేక్షకుల ముందు ఆడడం ఎల్లప్పుడూ ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. చెపాక్‌లో మ్యాచ్ ఆడటాన్ని ఎప్పుడూ ఇష్టపడతాను. ఇక్కడ నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. చివరి సారి నేను సెంచరీ చేసినప్పుడు మీరు (రవిశాస్త్రి) కోచ్‌గా ఉన్నారు. ఈ శతకం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. టీఎన్‌పీఎల్ టీ20 టోర్నమెంట్‌లో నా బ్యాటింగ్ పై కాస్త ఫోకస్ పెట్టాను. అది ఈ మ్యాచ్‌లో నాకు ఎంతో సాయపడింది.
ఎర్రమట్టి పిచ్ పై షాట్లు కొట్టడం కొంచెం కష్టమే. అతడు (జడేజా) బాగా ఆడాడు. నేను అలసిపోయిన సమయంలో జడ్డూ గమనించి బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. గతకొన్నాళ్లుగా మా జట్టులో అత్యుత్తమ బ్యాటర్లలో జడ్డూ ఒకడు. ఇక రేపు పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. రేపు ఉదయం సెషన్‌లో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించవచ్చు. మ్యాచ్ సాగే కొద్ది స్పిన్నర్లకు సహకారం అందిస్తుందని అనుకుంటున్నాను. అని అశ్విన్ అన్నాడు.
IPL 2025 : ఐపీఎల్ 2025 మెగా వేలానికి డేట్ ఫిక్స్!.. ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్ టెన్షన్?
A stellar TON when the going got tough!
A round of applause for Chennai’s very own – @ashwinravi99 👏👏
LIVE – https://t.co/jV4wK7BgV2 #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/j2HcyA6HAu
— BCCI (@BCCI) September 19, 2024