IPL 2025 : బీసీసీఐ రిటెన్షన్ పాలసీ ఇదేనా? 4+2!
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగావేలాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

IPL 2025 BCCI to Allow Teams Four Retentions Plus Two RTMs
IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగావేలాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా వేలాన్ని నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధం అవుతోందని వార్తలు వస్తున్నాయి. గతసారి లాగే ఈ ఏడాది కూడా విదేశాల్లోనే వేలాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
గతసారి దుబాయ్ వేదికగా వేలం జరుగగా ఈ సారి అబుదాబీ వేదికగా నిర్వహించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి రిటెన్షన్ పాలసీ పైనే ఉంది. దీని పై ఇప్పటికే బీసీసీఐ దృష్టి పెట్టింది. అన్ని ఫ్రాంచైజీలతో సమావేశమై వారి సలహాలు, అభిప్రాయాలను తీసుకుంది. అయితే.. ఆ సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు.
IND vs BAN : పూజల ఫలితం దక్కిందోచ్..! బ్యాట్, హెల్మెంట్‌కు పంత్ పూజలు.. ఎందుకో తెలుసా?
ఎక్కువ మందిని రిటైన్షన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. రిటెన్షన్ కింద నలుగురు ఆటగాళ్లని, ఆర్‌టీఎమ్ (రైట్ టు మ్యాచ్) ద్వారా ఇద్దరు ఆటగాళ్లు ఎంచుకునే అవకాశాన్ని ప్రాంఛైజీలకు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అంటే ఈ లెక్కన మొత్తం ఆరుగురు ఆటగాళ్లను ప్రతి ఫ్రాంచైజీ అట్టిపెట్టుకోవచ్చు.
అంటే నలుగురిని నేరుగా రిటైన్ చేసుకోవడంతో పాటు మరో ఇద్దరిని వేలంలో ఆర్‌టీఎమ్ ద్వారా తిరిగి కొనుగోలు చేయొచ్చు. అయితే ఇందులో అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల దాదాపు అన్ని జట్లు తమ కీలక ఆటగాళ్లందరిని అట్టిపెట్టుకోవచ్చు. తమ జట్టు కాంబినేషన్ పెద్దగా దెబ్బతినదు. అయితే.. ఇప్పటికే సరైన కాంబినేషన్ లేక ఇబ్బందులు పడుతున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మెగా వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకోవాలని అనుకుంటున్నాయి. ఈ రెండు జట్లకు ఈ నిర్ణయంతో నిరాశ తప్పకపోవచ్చు.
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. భారత్ నుంచి 10వ బౌలర్..