Team India : టీమ్ఇండియా సరికొత్త చరిత్ర.. 92 ఏళ్లు.. 580 మ్యాచ్‌లు.. 36 మంది కెప్టెన్లు..
టీమ్ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది.

First Time in 92 years Team India sensational test cricket feat
Team India : టీమ్ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 280 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ఈ అరుదైన ఘనత సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఓటముల కంటే అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా అవతరించింది.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌తో కలిపి భారత్ 580 మ్యాచులు ఆడింది. ఇందులో 179 మ్యాచుల్లో విజయాలు సాధించగా, మరో 178 మ్యాచుల్లో ఓడిపోయింది. 222 మ్యాచులను డ్రా చేసుకుంది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన నాలుగో జట్టుగా టీమ్ఇండియా అవరించింది. మరో నాలుగు టెస్టుల్లో విజయాలు సాధిస్తే మూడో స్థానానికి చేరుకుంటుంది.
IND vs BAN : అశ్విన్ మాయాజాలం.. తొలి టెస్టులో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం
భారత ప్రయాణం ఇలా..
1932లో భారట జట్టు క్రికెట్ ఆడడం మొదలు పెట్టింది. అయితే.. తొలి మ్యాచ్‌లో గెలిచేందుకు దాదాపు 20 ఏళ్లు పట్టింది. 1952లో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. ఆ చారిత్రాత్మక విజయానికి చెన్నై వేదిక కాగా.. యాదృచ్చికంగా ఇప్పుడు అదే స్టేడియంలో భారత్ ఈ రికార్డు సాధించడం గమనార్హం.
92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 36 మంది కెప్టెన్లుగా వ్యవహరించారు. తొలి కెప్టెన్ సీకే నాయుడు నుంచి ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వరకు ప్రతి ఒక్కరూ జట్టును ముందుండి నడింపించారు. విజయాలతో పాటు మరెన్నో మరుపురాని జ్ఞాపకాలను అందించారు. ఇప్పటి వరకు 314 మంది క్రికెటర్లు టెస్టులు ఆడారు.
IND vs BAN : పూజల ఫలితం దక్కిందోచ్..! బ్యాట్, హెల్మెంట్‌కు పంత్ పూజలు.. ఎందుకో తెలుసా?