అంతర్జాతీయ క్రికెట్‌కు వెన్ను గాయం కారణంగా కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్న భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ రీ ఎంట్రీ ఖరారు అయింది. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికాతో టెస్టుకు ముందే జట్టులోకి తీసుకోవాలని భావించారు. ఆ సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో బుమ్రా వెన్ను కింది భాగంలో చీలిక ఉన్నట్లు తేలింది. రెండు నెలల పాటు గాయానికి చికిత్స తీసుకున్న బుమ్రా వచ్చే ఏడాది జనవరిలో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తేల్చి చెప్పాడు.
ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ పర్యటన ముగియగానే వెస్టిండీస్ ఆ తర్వాత ఆస్ట్రేలియా భారత్‌కు రానున్నాయి. ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య జనవరి 14 నుంచి 19 వరకూ మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్‌తో జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా సర్జరీకి సూచించిన బీసీసీఐ వైద్యుల సలహా మేరకు చికిత్స సరిపోతుందని తెలిపింది.
బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్ పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగేందుకు సిద్ధమైపోతున్నాడు. ఆగష్టు నుంచి టీమిండియాకు దూరంగా ఉంటున్న భువీ.. సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీలో తన ఫిట్ నెస్ ను నిరూపించుకున్నాడు. ఈ మేర సెలక్టర్లు వెస్టిండీస్ జట్టులోకి భువీని ఎంపిక చేసుకోనున్నట్లు సమాచారం.