Jasprit Bumrah : ఇంగ్లాండ్ బ‌జ్‌బాల్ గేమ్ ఆడితే.. నాకు చాలా లాభం : బుమ్రా

మ‌రో రెండు రోజుల్లో ఆరంభం కానున్న ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌కు భార‌త్ స‌న్న‌ద్ధం అవుతోంది.

Jasprit Bumrah

Jasprit Bumrah : మ‌రో రెండు రోజుల్లో ఆరంభం కానున్న ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌కు భార‌త్ స‌న్న‌ద్ధం అవుతోంది. గురువారం నుంచి ఇరు జ‌ట్ల మ‌ధ్య హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్‌ వేదిక‌గా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు హైద‌రాబాద్‌కు చేరుకుని ప్రాక్టీస్ మొద‌లుపెట్టేశాయి. ప్ర‌త్య‌ర్థి పై విజ‌యం సాధించేందుకు త‌మ త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి.

అయితే.. గ‌త కొన్నాళ్లుగా ఇంగ్లాండ్ జ‌ట్టు టెస్టుల్లో బ‌జ్‌బాల్ విధానాన్ని అనుస‌రిస్తోంది. తాజాగా భార‌త్‌పైనా ఇదే విధంగా ఆడాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే ఇంగ్లాండ్ కోచ్ బ్రెండ‌న్ మెక్‌క‌ల‌మ్‌తో పాటు మాజీ ఇంగ్లీష్ ఆట‌గాళ్లు దీనిపై హింట్ ఇచ్చేశారు. ఇంగ్లాండ్ బ‌జ్‌బాల్ విధానంపై టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఈ ఆట‌తీరు వ‌ల్ల త‌న‌ను ఎలాంటి ఇబ్బందుల‌కు గురి చేయ‌లేర‌ని, ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకే ఎక్కువ న‌ష్టం క‌లుగుతుంద‌న్నాడు.

Rahul Dravid : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌.. కేఎల్ రాహుల్ వ‌ద్దు.. అత‌డే ముద్దు అంటున్న రాహుల్ ద్ర‌విడ్‌

ఇంగ్లాండ్ బ‌జ్‌బాల్ ఆడుతుందా లేదా అనే విష‌యం త‌న‌కు అన‌వ‌సం అని చెప్పాడు. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల కోసం ప్ర‌త్యేకించి ఎలాంటి వ్యూహాల‌ను ర‌చించ‌లేద‌ని చెప్పాడు. అయితే.. ఇటీవ‌ల ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన క్రికెట్ ఆడుతోంద‌ని తెలిపాడు. టెస్టు క్రికెట్‌ను ఇలా కూడా ఆడొచ్చున‌ని ప్ర‌పంచానికి చూపించార‌న్నాడు.

తాను ఓ బౌల‌ర్‌ను అని, ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై పై చేయి సాధించేందుకే ఎక్కువ‌గా ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. ఒక‌వేళ ఇంగ్లీష్ బ్యాట‌ర్లు దూకుడుగా ఆడితే.. వారు త‌న‌ను అల‌స‌ట‌కు గురి చేయ‌లేర‌న్నాడు. దాని వ‌ల్ల ఎక్కువ వికెట్లు తీసే అవ‌కాశం వ‌స్తుంద‌న్నాడు. ఎప్పుడైనా స‌రే తాను మైదానంలోకి దిగిన సంద‌ర్భాల్లో ప‌రిస్థితుల‌కు త‌న‌కు ఎలా అనుకూలంగా మ‌లచుకోవాల‌నే విష‌యాల‌పైనే దృష్టి సారిస్తాయ‌న‌ని బుమ్రా తెలిపాడు.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు టీమ్ఇండియాకు షాక్‌..! అదే జ‌రిగితే ఇక క‌ష్ట‌మే..!

ట్రెండింగ్ వార్తలు