కోహ్లీ, ధోనీ గురించి అడిగితే.. మరో క్రికెటర్ పేరు చెప్పిన జావెలిస్ స్టార్ నవదీప్ సింగ్

పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ నవదీప్ సింగ్ జావెలిన్ త్రో ఈవెంట్ లో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా అతను ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

Navdeep Singh

Javelin star Navdeep Singh : పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ నవదీప్ సింగ్ జావెలిన్ త్రో ఈవెంట్ లో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా అతను ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో క్రికెట్ లో మీరు ధోనీ అభిమానా.. విరాట్ కోహ్లీ అభిమానా? అని ప్రశ్నించగా.. నవదీప్ సింగ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. వారిద్దరి పేరు చెప్పకుండా భారత్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు చెప్పాడు.

Also Read : Sanju Samson : ఇలాగైతే ఎలా..? ఏం మాత్రం మార‌ని సంజూ శాంస‌న్‌!

రోహిత్ శర్మ బాగా ఆడతాడు. అతని డబుల్ సెంచరీల నుంచి నేను రోహిత్ కు పెద్ద అభిమానిగా మారానని చెప్పాడు. రోహిత్ ఆడుతున్నంత సేపు అలా చూడాలనిపిస్తుంది అంటూ పేర్కొన్నాడు. జావెలిన్ త్రోయర్ లో అతని దూకుడును క్రికెట్ లో విరాట్ కోహ్లీ దూకుడుతో పోల్చుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ విషయంపై అడిగినప్పుడు.. విరాట్ కోహ్లీకి నేను అభిమానిని.. అయితే, హిట్ మ్యాన్ బ్యాటింగ్ అంటే నాకు ఇష్టమని నవదీప్ సింగ్ పేర్కొన్నారు.

Also Read : Virat Kohli : కోహ్లీ వ‌చ్చేశాడు.. లండ‌న్ నుంచి చెన్నైకి చేరుకున్న విరాట్‌.. రోహిత్ శ‌ర్మ సైతం..

పారిస్ పారాలింపిక్స్ లో విజయభేరి అనంతరం స్వదేశానికి వచ్చిన భారత అథ్లెట్స్ గురువారం ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని అభినందించారు. అయితే, స్టార్ జావెలిన్ త్రోయర్ నవదీప్ సింగ్ కలిసినప్పుడు ప్రధాని మోదీ నేలమీద కూర్చొని మరీ తలపై టోపీ పెట్టించుకున్నారు. తాను తెచ్చిన టోపీని మీ తలపై పెట్టాలని ప్రధానిని కోరడంతో ప్రధాని నేలపై కూర్చుకున్నారు. ఎందుకంటే నవదీప్ సింగ్ హైట్ చాలా తక్కువగా ఉంటాడు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.