Virat Kohli : కోహ్లీ వచ్చేశాడు.. లండన్ నుంచి చెన్నైకి చేరుకున్న విరాట్.. రోహిత్ శర్మ సైతం..
సుదీర్ఘ విరామం తరువాత టీమ్ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది.

Virat Kohli and Rohit Sharma Land in Chennai Ahead of Opening Test Against Bangladesh
Virat Kohli – Rohit Sharma : సుదీర్ఘ విరామం తరువాత టీమ్ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. ఇప్పటికే మొదటి టెస్టులో పాల్గొనే జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో తొలి టెస్టుకు ఎంపిక అయిన ఆటగాళ్లు చెన్నైకి చేరుకుంటున్నారు. తాజాగా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలు చెన్నైలో అడుగుపెట్టారు.
విరాట్ కోహ్లీ గత కొన్నాళ్లుగా లండన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. బంగ్లాతో సిరీస్ కోసం అతడు చెన్నైకి వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో విమానం దిగి తన హోటల్ గదికి వెళ్లిపోయాడు. అటు రోహిత్ శర్మ సైతం ముంబై నుంచి చైన్నైకి చేరుకున్నాడు.
Hardik Pandya : హార్దిక్ వీడియో వెనుక అర్థం ఏమిటి? గంభీర్ మాస్టర్ ప్లాన్?
Virat Kohli came directly to the Chennai Airport from London at 4 AM early in the Morning. 🥰❤️ pic.twitter.com/82yvAsofJu
— Virat Kohli Fan Club (@Trend_VKohli) September 13, 2024
దాదాపు 18 నెలల తరువాత భారత జట్టు సొంతగడ్డ పై టెస్టు సిరీస్ ఆడనుంది. గతేడాది మార్చిలో ఆడింది. కోహ్లీ, రోహిత్ శర్మలు నేడు జట్టుతో కలిసే అవకాశం ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఫైనల్ కు చేరుకోవాలంటే ప్రతి టెస్టు మ్యాచులో విజయం సాధించడం ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో బంగ్లాతో టెస్టు సిరీస్‌లో విజయం సాధించి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
మరోవైపు పాకిస్థాన్ గడ్డపై పాక్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. భారత గడ్డపై అద్భుతాలు చేయాలని ఆరాటపడుతోంది. ఈ క్రమంలో సిరీస్ హోరాహోరీగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
CAPTAIN ROHIT SHARMA HAS ARRIVED IN CHENNAI. 🇮🇳pic.twitter.com/LwxDknAQUZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 13, 2024