AFG vs NZ : అఫ్గానిస్థాన్‌-న్యూజిలాండ్ ఏకైక టెస్టు ర‌ద్దు.. 91 ఏళ్ల త‌రువాత భార‌త్‌లో మొద‌టి సారి ఇలా..

అఫ్గానిస్థాన్ ఆశ‌లు ఆవిరి అయ్యాయి. గ్రేట‌ర్ నోయిడా వేదిక‌గా న్యూజిలాండ్‌-అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది.

AFG vs NZ : అఫ్గానిస్థాన్‌-న్యూజిలాండ్ ఏకైక టెస్టు ర‌ద్దు.. 91 ఏళ్ల త‌రువాత భార‌త్‌లో మొద‌టి సారి ఇలా..

Afghanistan vs New Zealand Gets Cancelled

Updated On : September 13, 2024 / 10:07 AM IST

Afghanistan vs New Zealand : అఫ్గానిస్థాన్ ఆశ‌లు ఆవిరి అయ్యాయి. గ్రేట‌ర్ నోయిడా వేదిక‌గా న్యూజిలాండ్‌-అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. క‌నీసం టాస్ వేయ‌డానికి కూడా కుద‌ర‌లేదు.

“నోయిడాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో అఫ్గానిస్థాన్‌తో జ‌రగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ ర‌ద్దు చేయ‌బ‌డింది. ఐదో రోజు ఉద‌యం అంపైర్లు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. రెండు టెస్టు మ్యాచుల సిరీస్ కోసం న్యూజిలాండ్ జ‌ట్టు శ్రీలంక‌కు బ‌య‌లు దేర‌నుంది. సెప్టెంబ‌ర్ 18 నుంచి లంకతో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.” అని కివీస్ క్రికెట్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

గ్రేట‌ర్ నోయిడాలో మొద‌టి రోజు వ‌ర్షం ఆగిన‌ప్ప‌టికి మైదానం చిత్త‌డిగా ఉండ‌డంతో మ్యాచ్ నిర్వ‌హించ‌డం సాధ్యం కాలేదు. అత్యాధునికి డ్రైనేజీ వ్య‌వ‌స్థ అందుబాటులో లేదు. క‌నీసం త్వ‌ర‌గా సిద్ధం చేసేందుకు స‌దుపాయాలు సైతం లేవు. దీనిపై క్రికెట్ వ‌ర్గాల నుంచి తీవ్ర స్థాయిలో వ‌చ్చాయి.

రాత్రి 2.30కి రోహిత్ శర్మ మెసేజ్ పంపాడు.. ఎందుకంటే?: పీయూష్ చావ్లా

ఇక రెండో రోజు నుంచి వ‌ర్షాలు రావ‌డంతో మ్యాచ్ నిర్వ‌హించ‌డం వీలు ప‌డ‌లేదు. క‌నీసం ఆఖ‌రి రోజైనా మ్యాచ్ జ‌రుగుతుంద‌ని ఆశించ‌గా.. మ్యాచ్ నిర్వ‌హించేందుకు మైదానం సిద్ధంగా లేక‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో.. టెస్టు క్రికెట్‌లో తమ ఉనికిని చాటుకోవాలని భావించిన అఫ్గానిస్థాన్‌కు నిరాశే ఎదురైంది.

91 ఏళ్ల త‌రువాత భార‌త దేశంలో క‌నీసం ఓ బంతి కూడా ప‌డ‌కుండా ర‌ద్దు అయిన మ్యాచ్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌పంచ టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఇలా ఓ బంతి కూడా ప‌డ‌కుండా ర‌ద్దు అయిన 8వ మ్యాచ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. గ‌తంలో 1890,1938,1970ల‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య‌, 1989లో న్యూజిలాండ్-పాక్, 1998లో వెస్టిండీస్‌ – ఇంగ్లాండ్‌, 1998లో భారత్ – న్యూజిలాండ్, 1998లో పాక్‌- జింబాబ్వే, 2024లో అఫ్గాన్ – కివీస్ ల మధ్య టెస్టులు సాధ్యపడలేదు.

Virat Kohli : మ‌రో 58 ప‌రుగులు చేస్తే.. 147 ఏళ్ల‌లో మొద‌టి క్రికెట‌ర్‌గా కోహ్లీ రికార్డు.. ఏంటో తెలుసా?