Virat Kohli : మరో 58 పరుగులు చేస్తే.. 147 ఏళ్లలో మొదటి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు.. ఏంటో తెలుసా?
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది.

1st In 147 Years Virat Kohli 58 Runs Away From Achieving Sensational Feat
Virat Kohli : భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి టెస్టు చెన్నైలోని చెపాక్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ చేరుకోవాలంటే ప్రతి టెస్టు మ్యాచ్ ఎంతో కీలకం కావడంతో బంగ్లాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. అటు పాకిస్థాన్‌పై చరిత్రాత్మక విజయాన్ని సాధించిన బంగ్లాదేశ్ సైతం భారత్ గడ్డపై కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఇరు జట్లు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అందరి దృష్టి విరాట్ కోహ్లీ పైనే ఉంది. టీ20లకు వీడ్కోలు పలికిన అతడు ప్రస్తుతం వన్డేలు, టెస్టులపైనే పూర్తి ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సృష్టించిన పలు రికార్డులను కోహ్లీ బ్రేక్ చేశాడు.
తాజాగా మరో రికార్డు ప్రస్తుతం విరాట్ కోహ్లీని ఊరిస్తోంది. బంగ్లాతో టెస్టు సిరీస్‌లో మరో 58 పరుగులు చేస్తే కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు.
ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 623 ఇన్నింగ్స్ (226 టెస్టు ఇన్నింగ్స్‌లు, 396 వన్డే ఇన్నింగ్స్‌లు, 1టీ20 ఇన్నింగ్స్)లో ఈ ఘనత సాధించాడు. కోహ్లీ ఇప్పటి వరకు 591 ఇన్నింగ్స్‌ల్లో 26,952 పరుగులు చేశాడు. మరో 8 ఇన్నింగ్స్‌ల్లో గనుక కోహ్లీ 58 పరుగులు చేస్తే 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో 600లోపు ఇన్నింగ్స్‌ల్లో 27 వేల పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకు ఎక్కుతాడు.
Natasa Stankovic : ముంబై వీధుల్లో కారులో బాయ్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా మాజీ భార్య చక్కర్లు
అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర లు మాత్రమే 27వేల కంటే ఎక్కువ పరుగులు చేశారు.