Natasa Stankovic : ముంబై వీధుల్లో కారులో బాయ్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా మాజీ భార్య చ‌క్క‌ర్లు

టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా నటి-మోడల్ నటాసా స్టాంకోవిక్ లు విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

Natasa Stankovic : ముంబై వీధుల్లో కారులో బాయ్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా మాజీ భార్య చ‌క్క‌ర్లు

Natasa Stankovic goes out and about in Mumbai with friend Aleksandar Ilac

Updated On : September 12, 2024 / 12:12 PM IST

Natasa Stankovic – Aleksandar Ilac : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా నటి-మోడల్ నటాసా స్టాంకోవిక్ లు విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. విడాకుల అనంత‌రం నటాసా సెర్బియా వెళ్లిపోయింది. దాదాపు రెండు నెల‌ల పాటు అక్క‌డే ఉన్న ఆమె ఇటీవ‌ల ముంబైకి వ‌చ్చింది. ఇప్పుడు ముంబైలో త‌న బాయ్‌ఫ్రెండ్ అలెక్సాండ‌ర్ ఇలాక్‌తో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

తెలుపు రంగు జాకెట్, నీలిరంగు ప్యాంటు ధరించి న‌టాసా ఓ జిమ్ వ‌ద్ద ఫోటో గ్రాఫ‌ర్ల‌కు పోజులిచ్చింది. అనంత‌రం స్వ‌యంగా త‌న కారును తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లింది. ఆమె ప‌క్క‌న అలెగ్జాండ‌ర్ ఉన్నాడు.

IND vs BAN : భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్‌.. రెండో టెస్టు వేదిక మార్పు?

సెర్బియాలోనే అగ‌స్త్య పుట్టిన రోజు..

న‌టాసా, హార్దిక్ పాండ్యాల‌కు అగ‌స్త్య అనే కుమారుడు ఉన్నారు. విడాకుల అనంత‌రం అగ‌స్త్య‌తో క‌లిసి న‌టాసా సెర్బియా వెళ్లిపోయింది. అక్క‌డ జూలై 30న అగ‌స్త్య పుట్టిన రోజును కుటుంబ స‌భ్యులు, స్నేహితుల మ‌ధ్య ఘ‌నంగా జ‌రిపించింది. అందుకు సంబంధించిన ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను అభిమానుల‌తో పంచుకుంటూనే ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)