IND vs BAN : భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. రెండో టెస్టు వేదిక మార్పు?
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్ జరగనుంది.

India vs Bangladesh 2nd Test To Be Moved Out Of Kanpur Report
IND vs BAN 2nd Test : సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్ జరగనుంది. తొలి టెస్టు చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు జరగనుండగా రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది. అయితే.. రెండో టెస్టు మ్యాచ్‌ను కాన్పూర్ నుంచి తరలించనున్నారు అనే వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే కారణంతో బంగ్లా పర్యటనను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ కాన్పూర్ నుంచి మ్యాచ్ ను తరలించే ప్రసక్తే లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేసినట్లు ఇండియా టుడే తెలిపింది.
Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ టికెట్ల ప్రారంభ ధర రూ.114 మాత్రమే.. వారికి ఫ్రీ
‘బెదిరింపులకు సంబంధించి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. క్రికెటర్లతో పాటు అభిమానులను స్వాగతించడానికి కాన్పూర్ సిద్ధంగా ఉంది. కాన్పూర్‌లోనే కాదు మరే స్టేడియం వద్ద ఇలాంటి పరిస్థితి ఉన్నా అందుకు తగినట్లు చర్యలు తీసుకుంటాం.’ అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు పేర్కొంది.
భారత పర్యటనలో బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. టెస్టు సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి, అక్టోబర్ 6 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. టెస్టుల్లో పాకిస్థాన్‌ను ఓడించి జోష్‌లో ఉంది బంగ్లాదేశ్. ఇప్పుడు అదే ఉత్సాహంలో భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది.
Rohit Sharma : ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసిందా..?
ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ఆకాష్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.