Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ టికెట్ల ప్రారంభ ధర రూ.114 మాత్రమే.. వారికి ఫ్రీ
యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.

Burj Khalifa lights up with Women's T20 World Cup as ICC announces ticket prices
Womens T20 World Cup 2024 : యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ్యాచ్ టికెట్ల ధరలను వెల్లడించింది. మ్యాచ్ టికెట్ల ప్రారంభ ధరను 5 దిర్హామ్‌లు నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో రూ.114 మాత్రమే. అంతేకాదండోయ్.. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారికి ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది.
ఎక్కువ మంది ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించడంతో పాటు యువతలో క్రికెట్ ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. టికెట్ల ధరల ప్రకటన సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై టీ20 వరల్డ్‌కప్ యొక్క లేజర్ షోను ప్రదర్శించారు.
Rohit Sharma : ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసిందా..?
ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. వీటిని రెండు గ్రూపులు విభజించారు. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్ లు ఉన్నాయి. మొత్తం 18 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూపులో ఒక్కొ జట్టు మిగిలిన జట్టుతో ఒక్కొ మ్యాచ్ ఆడనుంది.
ఆ తరువాత గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. లీగ్ మ్యాచ్‌లు దుబాయ్, షార్జా వేదికగా జరుగుతాయి. అక్టోబర్ 17, 18 తేదీల్లో సెమీఫైనల్స్ ను నిర్వహించనున్నారు. సెమీఫైనల్స్‌కు షార్జా వేదిక కానుంది. ఇక ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా అక్టోబర్ 20న జరగనుంది.
Buchi Babu tournament : బుచ్చిబాబు టోర్నీ విజేతగా హైదరాబాద్..
View this post on Instagram