రాత్రి 2.30కి రోహిత్ శర్మ మెసేజ్ పంపాడు.. ఎందుకంటే?: పీయూష్ చావ్లా

రోహిత్ శర్మ ఓ కాగితంపై ఫీల్డ్‌ను గీశాడని, వార్నర్‌ను ఔట్ చేయడంపై తనతో చర్చించాడని అన్నాడు.

రాత్రి 2.30కి రోహిత్ శర్మ మెసేజ్ పంపాడు.. ఎందుకంటే?: పీయూష్ చావ్లా

Updated On : September 13, 2024 / 8:44 AM IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనకు గతంలో రాత్రి 2.30 గంటలకు మెసేజ్ పంపాడని గుర్తుచేసుకున్నాడు క్రికెటర్ పీయూష్ చావ్లా. చివరిగా పీయూష్ చావ్లా 2012 డిసెంబర్‌లో టీమిండియా తరఫున ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మతో కలిసి పీయూష్ చావ్లా ఆడాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో చావ్లా కూడా ఉన్నాడు.

అలాగే, 2023లో చావ్లా రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో చావ్లా మాట్లాడుతూ… రోహిత్ కెప్టెన్‌ కెప్టెన్సీ గురించి చెప్పాడు. తాను రోహిత్ శర్మతో కలిసి ఎన్నో మ్యాచులు ఆడానని చావ్లా తెలిపాడు.

తాము మైదానం వెలుపల కూడా మాట్లాడుకుంటామని, ఓ సారి అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు రోహిత్ శర్మ తనకు మెసేజ్ చేశాడని, ఆ సమయంలో తాను నిద్రపోతున్నానా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకున్నాడని చెప్పాడు. నిద్రపోకపోతే వార్నర్‌ ఔట్ చేసే వ్యూహంపై చర్చిద్దామన్నాడని తెలిపాడు. రోహిత్ శర్మ ఓ కాగితంపై ఫీల్డ్‌ను గీశాడని, వార్నర్‌ను ఔట్ చేయడంపై తనతో చర్చించాడని అన్నాడు.

ఆ సమయంలోనూ.. తన నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఎలా రాబట్టాలన్న విషయంపైనే రోహిత్ శర్మ ఆలోచించాడని చెప్పాడు. ‘ఆయనో నాయకుడు.. ఆయనో కెప్టెన్’ అని పీయూష్ చావ్లా అన్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో, 2024 టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ ఆడిన తీరు తదుపరి బ్యాటర్లకు ఆటను సులభం చేసిందని చెప్పాడు.

Also Read: ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో భార‌త్ హ‌వా.. వ‌రుస‌గా నాలుగో విజ‌యం.. సెమీస్‌కు..