Asian Champions Trophy : ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో భార‌త్ హ‌వా.. వ‌రుస‌గా నాలుగో విజ‌యం.. సెమీస్‌కు..

ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ హ‌కీలో భార‌త జ‌ట్టు అద‌ర‌గొడుతోంది.

Asian Champions Trophy : ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో భార‌త్ హ‌వా.. వ‌రుస‌గా నాలుగో విజ‌యం.. సెమీస్‌కు..

Asian Champions Trophy India secure semi finals spot

Asian Champions Trophy 2024 : ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ హ‌కీలో భార‌త జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. వ‌రుస‌గా నాలుగో విజ‌యాన్ని సాధించి సెమీఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. గురువారం ద‌క్షిణ కొరియా పై 3-1 తేడాతో విజ‌యం సాధించింది. 8వ నిమిషంలో అరైజీత్ సింగ్‌, 9వ‌, 43వ నిమిషాల్లో కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ లు భార‌త్ త‌రుపున గోల్స్ చేశారు.

ఇక ద‌క్షిణ కొరియా త‌రుపున న‌మోదైన ఏకైక గోల్‌ను 30వ నిమిషంలో జిహున్ యాంగ్ న‌మోదు చేశాడు. గ్రూపు ద‌శ‌లో భార‌త్ త‌న చివ‌రి మ్యాచ్‌ను శ‌నివారం పాకిస్థాన్‌తో ఆడ‌నుంది. ఇప్ప‌టికే భార‌త్ సెమీఫైన‌ల్‌కు చేరుకున్న నేప‌థ్యంలో ఈ మ్యాచ్ నామ‌మాత్ర‌మే. అయిన‌ప్ప‌టికి కూడా చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్ పై విజ‌యం సాధించి గెలుపు జైత్ర యాత్ర‌ను కొన‌సాగించాల‌ని భార‌త్ భావిస్తోంది.

AFG vs NZ : అరుదైన లిస్ట్‌లో చేర‌నున్న అఫ్గానిస్థాన్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్!

కాగా.. అంతక ముందు 3-0తో చైనాను, 5-1తో జపాన్‌ను, 8-1తో మలేసియాను భార‌త్ ఓడించింది. ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆరు జ‌ట్టు పోటీప‌డుతున్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో టోర్నీ జ‌రుగుతోంది. అంటే ప్ర‌తి జ‌ట్టు మిగిలిన జ‌ట్ల‌తో ఒక్కొ మ్యాచ్ ఆడ‌నుంది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. వ‌రుస‌గా నాలుగు మ్యాచులు గెల‌వ‌డంతో భార‌త్ సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.