AFG vs NZ : అరుదైన లిస్ట్‌లో చేరనున్న అఫ్గానిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్!
అఫ్గానిస్థాన్ ఫ్యాన్స్ ఆశలపై వరుణుడు మరోసారి నీళ్లు చల్లాడు.

AFG vs NZ Greater Noida Test set to join rare list after rain washes out 4th day
Afghanistan vs New Zealand : అఫ్గానిస్థాన్ ఫ్యాన్స్ ఆశలపై వరుణుడు మరోసారి నీళ్లు చల్లాడు. న్యూజిలాండ్‌తో గ్రేటర్ నోయిడా వేదికగా జరగాల్సిన తొలి టెస్టు మ్యాచ్ రద్దు అయ్యే దిశగా సాగుతోంది. వర్షం కారణంగా నాలుగో రోజు ఆటను రద్దు చేశారు. కనీసం ఇప్పటి వరకు టాస్ కూడా వేయలేదు. చివరి రోజు గురువారం ఆట జరగడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. మూడో రోజు సైతం వర్షం కారణంగా ఆటను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
‘వరుణుడి కారణంగా ఈ రోజు ఆట పూర్తిగా రద్దైంది. రేపు తిరిగొస్తాం. రేపు కూడా మ్యాచ్ జరిగే అవకాశం కనిపించడం లేదు. 2500 టెస్టుల సుధీర్ఘ చరిత్రలో బంతి పడకుండా మ్యాచ్ రద్దైన ఎనిమిదో మ్యాచ్ గా ఇది చరిత్రలో నిలిచిపోతుందని అనుకుంటున్నాను. గతం వారం రోజులుగా ఇక్కడ 12 సెంటీమీటర్ల వర్షం కురుస్తోందని.’ అఫిషియల్ బ్రాడ్ కాస్టర్ ఆండ్రూ లియోనార్డ్ అన్నారు.
ఎప్పుడో గానీ టెస్టు క్రికెట్ ఆడే అవకాశం రాని అఫ్గానిస్థాన్ లాంటి జట్టుకు ఇది ఖచ్చితంగా చేదువార్తే. న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుతో తమ జట్టు ఎలా ఆడుతుందో చూడాలని భావించిన సగటు అఫ్గానిస్థాన్ అభిమానికి వరుణుడు షాకిచ్చాడు. ఇంకోవైపు టెస్టు మ్యాచ్ జరగకపోవడంతో న్యూజిలాండ్ టీమ్ కూడా నిరాశలో ఉంది.
వాస్తవానికి చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ సోమవారం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. అంతకముందు కురిసిన వర్షాల కారణంగా మైదానం చిత్తడిగా మారింది. నోయిడాలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేదు. దీంతో నీరు వెళ్లే మాత్రం లేకపోవడం, గ్రౌండ్‌ను సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో తొలి రెండు రోజులు మ్యాచ్ ఆడేందుకు వీలు పడలేదు. పోనీ మూడో రోజైన మ్యాచ్ జరుగుతుందని భావించగా.. వర్షం కురవడంతో మూడు, నాలుగో రోజు ఆటను రద్దు చేశారు.