టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ రికార్డులకు ఎక్కాడు. మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో వ్యక్తిగత స్కోరు 120 పరుగుల వద్ద అతడు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.
రికీ పాంటింగ్ 168 టెస్టుల్లో 51.9 సగటుతో 13,378 పరుగులు చేశాడు. కాగా.. జోరూట్ 157 మ్యాచ్‌ల్లో పాంటింగ్‌ను అధిగమించాడు. ఇక టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 200 టెస్టుల్లో 53.8 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ప్రస్తుతం సచిన్‌కు రూట్‌కు మధ్య 2500 రన్స్‌కిపైగా వ్యత్యాసం ఉంది.
ITS ONLY SACHIN & ROOT – ITS GOING TO BE FUN…!!! ✅ pic.twitter.com/AFWubSRXq2
— Johns. (@CricCrazyJohns) July 25, 2025
అయితే.. ఇప్పటికిప్పుడు టెండూల్కర్ రికార్డుకు వచ్చిన ముప్పు ఏమీలేదుగానీ.. ప్రస్తుతం రూట్ ఉన్న ఫామ్‌ను మరో మూడేళ్లు కొనసాగిస్తే మాత్రం టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
సచిన్ టెండూల్కర్ (భారత్) – 200 మ్యాచ్‌ల్లో 15,921 పరుగులు
జోరూట్ (ఇంగ్లాండ్) – 157 మ్యాచ్‌ల్లో 13,379* పరుగులు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 168 మ్యాచ్‌ల్లో 13,378 పరుగులు
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 166 మ్యాచ్‌ల్లో 13,289 పరుగులు
రాహుల్ ద్రవిడ్ (భారత్) – 164 మ్యాచ్‌ల్లో 13,288 పరుగులు
ఇదిలా ఉంటే.. అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రూట్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. తాజాగా భారత్ పై చేసిన సెంచరీ టెస్టు క్రికెట్‌లో రూట్‌కు 38 సెంచరీ.
Rishabh Pant : అరెరె.. పంత్ అద్భుత రికార్డు సాధించాడుగా.. గాయం మ్యాటర్‌లో పడి అందరూ..
టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
సచిన్ టెండూల్కర్ (భారత్) – 200 మ్యాచ్‌ల్లో 51 శతకాలు
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 166 మ్యాచ్‌ల్లో 45 శతకాలు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 168 మ్యాచ్‌ల్లో 41 శతకాలు
కుమార సంగక్కర (శ్రీలంక) – 134 మ్యాచ్‌ల్లో 38 శతకాలు
జోరూట్ (ఇంగ్లాండ్) – 157 మ్యాచ్‌ల్లో 38 శతకాలు