గోపీచంద్‌పై కుండబద్దలు కొట్టిన జ్వాల గుత్తా

భారత బ్యా‍డ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌పై బ్యాడ్మింటన్‌ ఫైర్‌ బ్రాండ్‌ గుత్తా జ్వాల మరోసారి ఫైర్ అయ్యారు. బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకున్న గోపీచంద్ ఆయన పట్ల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. శిక్షణ తీసుకోవడానికి వెళ్లిన వ్యక్తినే తప్పుబడుతున్నాడంటూ మండిపడ్డారు. గోపీచంద్‌పై ‘డ్రీమ్స్‌ ఆప్‌ ఎ బిలియన్‌, ఇండియా అండ్‌ ద ఒలింపిక్‌ గేమ్స్‌’ అనే పుస్తకం విడుదల కానుంది. 

ఈ పుస్తకంలో ఉన్న విషయాలపై కొన్ని అభిప్రాయాలు బయటికొచ్చాయి. గతంలో వచ్చిన మనస్పర్థల సైనా నెహ్వాల్‌ అకాడమీ నుంచి బయటకు వెళ్లిపోయిన సంగతి గురించి ఇలా ఉంది. సైనా బయటకు వెళ్లిపోవడం ఇష్టంలేదని వినిపించుకోకుండా వెళ్లిపోయింది. ఆ ఘటనలో ఒలింపిక్స్‌ గోల్డ్‌క్వెస్ట్‌ సభ్యులైన ప్రకాశ్‌ పదుకొనే, విమల్‌ కుమార్, వీరేన్‌ రస్కినా సైనాను హైదరాబాద్‌ వీడేందుకు ప్రోత్సహించినట్లుగా గోపీచంద్ రాసుకొచ్చాడట. 

ప్రకాశ్‌ పదుకొనే గురించి ప్రస్తావించడానికి అంత ప్రత్యేకత లేదంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై గుత్తా జ్వాల ఫైర్ అయ్యారు. ‘ఇక్కడ ఏడుస్తున్న వ్యక్తి.. ప్రకాశ్‌ సర్‌ దగ్గర శిక్షణ తీసుకోడానికి హైదరాబాద్‌ను వదిలి వెళ్లాడు. ఈ విషయాన్ని ఎవరూ  ఎందుకు ప్రశ్నించట్లేదు’ అని ట్వీట్‌ చేశారు. ఈ వివాదంపై ప్రకాశ్‌ పదుకొనే బ్యాడ్మింటన్‌ అకాడమీ స్పందిస్తూ.. రియో ఒలింపిక్స్‌ సమయంలో సైనా హైదరాబాద్‌లోని పుల్లెల అకాడమీ నుంచి బెంగళూరు వెళ్లడానికి తమ ప్రమేయం లేదని వెల్లడించింది. 

అయితే ఈ ట్వీట్లలో జ్వాల గుత్తా ఫైర్ అవుతుంటే మరో నెటిజన్ పుస్తకం బయటికొస్తే నిజాలు తెలుస్తాయి కదా. పూర్తి సమాచారం లేకుండా వాదించకూడదని అంటే ఆ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన జ్వాల… నేను ఆ ఘటన జరిగినప్పుడు నేషనల్ క్యాంప్ లోనే ఉన్నాను. నాకు తెలుసులే అన్నట్లు సమాధానమిచ్చింది. 

2014 ప్రపంచ చాంపియన్‌షిప్‌ తర్వాత సైనా నెహ్వాల్‌ గోపీచంద్‌ అకాడమీని వదిలి బెంగళూరులో ప్రకాశ్‌ పదుకొనే అకాడమీలో చేరింది. రెండేళ్లపాటు కోచ్‌ విమల్‌ కుమార్‌ వద్ద శిక్షణ తీసుకున్న సైనా.. మళ్లీ తిరిగి గోపీచంద్‌ అకాడమీకి వచ్చేసింది. కోచ్‌ గోపీచంద్‌ కూడా ప్రకాశ్‌ పదుకొనే దగ్గర శిక్షణ తీసుకున్నవాడే కావడం గమనార్హం.