Kagiso Rabada
Kagiso Rabada: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ(Kagiso Rabada) చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రబాడ గురువారం గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకున్నాడు. గుజరాత్ ఓపెనర్ సాహాను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్‌లో వందో వికెట్‌ను సాధించాడు. కాగా.. ఈ సీజన్‌లో రబాడకు ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం.
IPL 2023, PBKS vs GT: గిల్ అర్ధశతకం.. గుజరాత్ టైటాన్స్ విజయం
ఐపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రబాడ చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు ఈ రికార్డు శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగ పేరిట ఉంది. వంద వికెట్లు తీసేందుకు రబాడకు 1438 బంతులు అవసరం కాగా మలింగ 1622 బంతులు అవసరం అయ్యాయి. వెస్టిండీస్ మాజీ బౌలర్ డ్వేన్ బ్రావో 1619 బంతులతో తృతీయా స్థానంలో కొనసాగుతున్నాడు. అతి తక్కువ మ్యాచుల్లో ఈ ఘనత అందుకుంది కూడా రబాడనే కావడం విశేషం. రబాడ 64 మ్యాచుల్లో వంద వికెట్లు సాధించగా, మలింగ్ 70 మ్యాచులు, భువనేశ్వర్, హర్షల్ పటేల్‌లు 81 మ్యా చులు అవసరం అయ్యాయి.
IPL 2023, KKR vs SRH: ఎవరి జోరు కొనసాగేనో..?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్ (36), జితేష్ శర్మ (25) రాణించారు. లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లల్లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (67;49 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. వృద్ధిమాన్ సాహా(30; 19 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. ఆఖరి ఓవర్‌లో మ్యాచ్ ఉత్కంఠకు దారితీయగా ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు తెవాటియా.