AUS vs WI : చూసుకోవాలి గ‌దా మామా.. ఇప్పుడు ఏమైందో చూడు.. దెబ్బలు గ‌ట్టిగానే త‌గిన‌ట్లున్నాయ్‌గా..!

క్రికెట్‌లో ర‌నౌట్లు అనేవి స‌హ‌జం. అయితే కొన్ని సార్లు బ్యాట‌ర్లు ర‌నౌట్ అయ్యే తీరు చాలా ఫ‌న్నీగా ఉంటుంది.

Kemar Roach run out after slipping in second Test against Australia

AUS vs WI 2nd Test : క్రికెట్‌లో ర‌నౌట్లు అనేవి స‌హ‌జం. అయితే కొన్ని సార్లు బ్యాట‌ర్లు ర‌నౌట్ అయ్యే తీరు చాలా ఫ‌న్నీగా ఉంటుంది. వాళ్లు కావాల‌ని అలా చేయ‌రు గానీ ఒక్కొక్క‌సారి అలా జ‌రిగిపోతుంది. గ‌బ్బా వేదిక‌గా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జ‌ట్లు మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచులో ఇలాంటి ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వెస్టిండీస్ బ్యాట‌ర్ కీమ‌ర్ రోచ్ ర‌నౌట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓవ‌ర్ నైట్ స్కోరు 266/8 తో రెండో రోజు ఆటను ప్రారంభించింది. 15 ఓవ‌ర్ల‌కు పైగా ఆడి మ‌రో 31 ప‌రుగులను జోడించి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. కాగా.. ఇన్నింగ్స్ 105వ ఓవ‌ర్ చివ‌రి బంతికి కీమ‌ర్ రోచ్ ర‌నౌట్ అయ్యాడు. క‌మిన్స్ బౌలింగ్ బౌలింగ్‌లో షాట్ ఆడిన రోచ్ ప‌రుగు తీసేందుకు ప్ర‌య‌త్నించాడు. బంతి ఫీల్డర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డంతో నాన్‌స్ట్రైక‌ర్ బ్యాట‌ర్ ప‌రుగు వ‌ద్ద‌ని చెప్పాడు. అప్ప‌టికే పిచ్ స‌గానికి పైగా ప‌రుగెత్తిన కీమ‌ర్ రోచ్ వెన‌క్కి వెళ్లాని భావించారు. వెన‌క్కి మ‌ళ్లే ప్ర‌య‌త్నంలో కాలు జారి ప‌డిపోయాడు.

Sania Mirza : విడాకుల త‌రువాత సానియా మీర్జా మొద‌టి పోస్ట్‌.. ఏమ‌న్న‌దంటే..?

బంతిని అందుకున్న ఫీల్డ‌ర్.. వికెట్ కీప‌ర్‌కు బంతిని అందించ‌గా కీప‌ర్ వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. దీంతో రోచ్ ర‌నౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో రోచ్ 40 బంతులు ఆడి ఎనిమిది ప‌రుగులు చేశాడు. కీమ‌ర్ రోచ్ ర‌నౌట్ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. నీ క‌ష్టం ప‌గొడికి కూడా రాకూడ‌దు, దుర‌దృష్టం అంటే నీదే అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 311 ప‌రుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ బ్యాట‌ర్ల‌లో జాషువా డా సిల్వా (79), కావెం హాడ్జ్ (71), కెవిన్ సింక్లైర్(50) హాఫ్ సెంచ‌రీలు చేశారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జోష్ హేజిల్ వుడ్, నాథ‌న్ ల‌య‌న్ చెరో రెండు, క‌మిన్స్ ఓ వికెట్ తీశాడు. అనంత‌రం ఆసీస్ మొద‌టి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. రెండో రోజు టీ విరామానికి నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 24 ప‌రుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (0), ఉస్మాన్ ఖావాజా (6)లు క్రీజులో ఉన్నారు.

Kane Williamson : కేన్ మామ వ‌చ్చేశాడు.. ర‌చిన్ ర‌వీంద్ర‌కు చోటు..

ట్రెండింగ్ వార్తలు