KKR vs RR : గిల్, మోర్గాన్ మెరుపులు.. రాజస్థాన్ లక్ష్యం 175

  • Publish Date - September 30, 2020 / 09:47 PM IST

IPL 2020- KKR vs RR : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైటరైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దీంతో కోల్ కతా రాజస్థాన్ కు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా ఓపెనర్లలో గిల్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 34 బంతుల్లో (47) శుభ్ మాన్ గిల్ హాఫ్‌ సెంచరీ చేశాడు. మోర్గాన్ కూడా అదే దూకుడుగా ఆడుతూ (34)లతో మెరుపులు పుట్టించాడు.



కానీ, జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో గిల్ రిటర్న్‌ క్యాచ్‌ ద్వారా పెవిలియన్‌ చేరాడు. మరో ఓపెనర్‌ నరైన్‌ 15 పరుగులకే చేతులేత్తేశాడు. ఆరంభం నుంచి చప్పగా సాగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఉనాద్కట్‌ బౌలింగ్‌లో సునీల్‌ నరైన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

నితీష్‌ రాణాతో కలిసి గిల్‌ ఇన్నింగ్స్‌ ఆడుతూ ఆకట్టుకున్నాడు. టామ్ కరన్ వేసిన 20 ఓవర్ లో మోర్గాన్ సిక్సర్ కొట్టాడు. పవర్‌ప్లే ముగిసిన తర్వాత గిల్‌, రాణాలు బౌండరీలు బాదుతూ స్కోరును పరుగులు పెట్టించారు. తెవాటియా వేసిన 10 ఓవర్‌లో చివరి బంతికి భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి నితీష్‌ రాణా వెనుదిరిగాడు.



మిగతా ఆటగాళ్లలో నితీశ్ రాణా (22), రస్సెల్ (24), కార్తీక్ (1), కమిన్స్ (12) పరుగులకే పెవిలియన్ చేరగా.. మోర్గాన్ (34), నాగర కోటి (8) పరుగులతో నాటౌట్ గా నిలిచారు.



రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు తీయగా, రాజ్ పూట్, ఉనాద్కత్, కరన్, తెవాటియా తలో వికెట్ తీసుకున్నారు. కాగా, రాజస్థాన్ ఓపెనర్లుగా స్మిత్, బట్లర్ బరిలోకి దిగారు. కోల్ కతా బౌలర్ నరేన్ తొలి ఓవర్ అందుకున్నాడు.