ఐపీఎల్ 2019 సీజన్ 12లో భాగంగా.. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. కోల్‌కతా కెప్టెన్ దినేశ్
ఐపీఎల్ 2019 సీజన్ 12లో భాగంగా.. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తిక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు బోణీ కొట్టని కోహ్లీసేన ఈ మ్యాచ్ గెలవాలని పట్టుదలగా ఉంది. కోల్‌కతా మూడో విజయంపై కన్నేసింది.
ఐపీఎల్ 2019 సీజన్ 12 ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతా తెరవనేలేదు. ఇతర ఐపీఎల్ జట్లు విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి. కోహ్లీసేన మాత్రం పరాజయాలతో వెనుకబడిపోయింది. గెలుపు గుర్రాలుగా పిలిచే బెంగళూరు జట్టు ఆటగాళ్లంతా ఒక్కసారిగా డల్ మారిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగే ఆటగాళ్ల సత్తా చాటలేక చతికలపడ్డారు. ఊహించని రీతిలో పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతోంది. స్టార్ ప్లేయర్స్ ఉన్నా బెంగళూరును ఓటమి వెంటాడుతోంది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ బెంగళూరు 4 మ్యాచ్ లు ఆడితే నాలుగు మ్యాచుల్లోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓటమి భారంతో బాధపడుతున్న రాయల్స్ బెంగళూరు జట్టు శుక్రవారం (ఏప్రిల్ 5, 2019) కోల్ కతా తో తలపడుతోంది. మరి ఈ మ్యాచ్ లో అయినా విరాట్ సేన బోణీ కొడుతుందో లేదో..