కటక్ వన్డే : రాహుల్, రోహిత్ హాఫ్ సెంచరీలు

డిసైడర్ వన్డే మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. జట్టుకి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు చేశారు. 316 పరుగుల

  • Publish Date - December 22, 2019 / 01:50 PM IST

డిసైడర్ వన్డే మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. జట్టుకి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు చేశారు. 316 పరుగుల

కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న డిసైడర్ వన్డే మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. జట్టుకి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు చేశారు. 316 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోహ్లి సేనకు ఓపెనర్లు మంచి ఓపెనింగ్ ఇచ్చారు. ఇద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. రెగులర్ గా బౌండరీలు బాదులూ స్కోర్ బోర్డును పరుగుపెట్టించారు.

ఈ క్రమంలో కేఎల్ రాహుల్ 49 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, రోహిత్ శర్మ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్…5 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 122 పరుగుల జట్టు స్కోర్ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది. హాఫ్ సెంచరీతో దూకుడు మీదున్న రోహిత్ శర్మ.. 63 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఔటయ్యాడు. రోహిత్ ను హోల్డర్ పెవిలియన్ పంపాడు.