Rahul Dravid : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌.. కేఎల్ రాహుల్ వ‌ద్దు.. అత‌డే ముద్దు అంటున్న రాహుల్ ద్ర‌విడ్‌

మ‌రో రెండు రోజుల్లో ఇంగ్లాండ్‌తో ఆరంభం కానున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ కోసం భార‌త జ‌ట్టు స‌న్న‌ద్ధం అవుతోంది.

Rahul Dravid - KL Rahul

Rahul Dravid – KL Rahul : మ‌రో రెండు రోజుల్లో ఇంగ్లాండ్‌తో ఆరంభం కానున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ కోసం భార‌త జ‌ట్టు స‌న్న‌ద్ధం అవుతోంది. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వేదిక‌గా గురువారం నుంచి భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు హైద‌రాబాద్ చేరుకున్నాయి. మ్యాచ్ కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. కాగా.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్‌ను వికెట్ కీప‌ర్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. ఈ సిరీస్‌లో అత‌డు కేవ‌లం బ్యాట‌ర్‌గానే బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు.

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు జ‌ట్టును ఎంపిక చేసే ముందే దీనిపై నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపాడు. అందుక‌నే ధ్రువ్ జురేల్‌, కేఎస్ భ‌ర‌త్‌ల‌ను వికెట్ కీప‌ర్లుగా ఎంపిక చేసిన‌ట్లు చెప్పాడు. ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో కేఎల్ రాహుల్ చాలా మంచి ప్ర‌ద‌ర్శ‌న చేశాడ‌ని ద్ర‌విడ్ కొనియాడాడు. టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించాడ‌ని గుర్తు చేసుకున్నాడు. అయితే.. స్వ‌దేశంలోని ప‌రిస్థితులు, ఐదు టెస్టు మ్యాచుల నేప‌థ్యంలో అత‌డిని కేవ‌లం బ్యాట‌ర్‌గానే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఆడించాల‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ద్ర‌విడ్ వివ‌రించాడు.

ICC ODI Team Of The Year 2023 : భార‌త ఆట‌గాళ్ల‌కు ప‌ట్టం క‌ట్టిన ఐసీసీ.. ఏకంగా ఆరుగురికి చోటు

ఇక కేఎస్ భ‌ర‌త్‌, ధ్రువ్ జురెల్‌ల‌లో ఒక‌రు వికెట్ కీప‌ర్‌గా తుది జ‌ట్టులోకి వ‌స్తారు అని ద్ర‌విడ్ చెప్పాడు. స్వ‌దేశంలోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించే ప‌రిస్థితులు ఉన్న నేప‌థ్యంలో స్పెష‌లిస్ట్ వికెట్ కీప‌ర్ ఖ‌చ్చితంగా ఉండాల‌న్నాడు.

ఇదిలా ఉంటే.. రోడ్డు ప్ర‌మాదంలో రిష‌బ్ పంత్ గాయ‌ప‌డ‌డంతో వికెట్ కీప‌ర్‌గా కేఎస్ భ‌ర‌త్ అవ‌కాశాల‌ను ద‌క్కించుకున్నాడు. గ‌తేడాది జ‌రిగిన ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైన‌ల్ మ్యాచ్‌లో అత‌డు ఆడాడు. భ‌ర‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా త‌రుపున ఐదు టెస్టు మ్యాచులు ఆడాడు. 18.4 స‌గ‌టుతో 129 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

వికెట్ కీప‌ర్‌గా రాణిస్తున్న‌ప్ప‌టికీ బ్యాట‌ర్‌గా చెప్పుకోద‌గ్గ ఇన్నింగ్స్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆడ‌లేదు. అయితే.. ఇటీవ‌ల ఇంగ్లాండ్ ల‌య‌న్స్‌తో జ‌రిగిన అన‌ధికార టెస్టు మ్యాచులో సెంచ‌రీ చేయ‌డంతో మొద‌టి టెస్టు మ్యాచులో అత‌డు తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. అదే జ‌రిగితే.. ధ్రువ్ జురెల్ టెస్టు అరంగ్రేటం కోసం మ‌రికొన్నాళ్లు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు టీమ్ఇండియాకు షాక్‌..! అదే జ‌రిగితే ఇక క‌ష్ట‌మే..!

ట్రెండింగ్ వార్తలు