Kuldeep Yadav : వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. కుల్దీప్ యాద‌వ్‌ను ఊరిస్తున్న భారీ మైలురాయి..

వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు భార‌త స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్‌ను (Kuldeep Yadav) ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది.

Kuldeep Yadav Needs 5 More wickets To Complete 100 wickets In International T20is

Kuldeep Yadav : టీమ్ఇండియా స్టార్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్ర‌మంలో భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్ల మధ్య జ‌ర‌గ‌నున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అత‌డు కీల‌క పాత్ర పోషించే అవ‌కాశాలు ఉన్నాయి. కాగా.. ఈ సిరీస్‌కు ముందు ఈ చైనామ‌న్ స్పిన్న‌ర్‌ను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో కుల్దీప్ 5 వికెట్లు ప‌డ‌గొడితే.. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్ల క్ల‌బ్‌లో అడుగుపెడ‌తాడు.

అంతేకాదండోయ్‌.. భార‌త్‌ త‌రుపున వంద వికెట్ల‌ను తీసిన ఐదో బౌల‌ర్‌గా కుల్దీప్ రికార్డుల‌కు ఎక్కుతాడు. అర్ష్‌దీప్ సింగ్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్ లు మాత్ర‌మే ఈ ఘ‌న‌త సాధించారు.

Ishan Kishan : వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. ఇషాన్ కిష‌న్‌ను ఊరిస్తున్న అరుదైన మైలురాయి..

2017లో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో కుల్దీప్ యాద‌వ్ అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 6.95 ఎకాన‌మీతో 95 వికెట్లు సాధించాడు. ఇందులో మూడు సార్లు నాలుగు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌, మ‌రో రెండు సార్లు 5 వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేశాడు.

భార‌త్ త‌రుపున అంత‌ర్జాతీయ టీ20ల్లో వంద వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..

* అర్ష్‌దీప్ సింగ్ – 94 మ్యాచ్‌ల్లో 140 వికెట్లు
* జ‌స్‌ప్రీత్ బుమ్రా – 100 మ్యాచ్‌ల్లో 126 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 114 వికెట్లు
* అక్ష‌ర్ ప‌టేల్ – 107 మ్యాచ్‌ల్లో 109 వికెట్లు

భార‌త్, వెస్టిండీస్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 6న (ల‌క్నో)
* రెండో టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 9న (రాంచీ)
* మూడో టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 11న (ఇండోర్‌)
* నాలుగో టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 14న (హైద‌రాబాద్‌)
* ఐదో టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 17న (బెంగ‌ళూరు)

Sree Charani : జ‌పాన్‌లో తెలుగమ్మాయి.. క్రికెట‌ర్ శ్రీచ‌ర‌ణి ఫోటోలు వైర‌ల్‌..

ఈ ఐదు మ్యాచ్‌లు కూడా భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభం అవుతాయి. మ్యాచ్‌కు అరగంట ముందు అంటే సాయంత్రం 6.30 గంట‌ల‌కు టాస్ వేస్తారు.