శ్రీలంక కెప్టెన్, సీనియర్ పేసర్ లసిత్ మలింగ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచనలో పడ్డాడు. వచ్చే ఏడాదిలో జరుగబోయే ప్రపంచ టీ20 కప్ తర్వాత కూడా రిటైర్మెంట్ నిర్ణయాన్ని మరో రెండేళ్లు పొడిగించాలని భావిస్తున్నాడు.
వచ్చే ఏడాదిలో ఆస్ట్రేలియాలో అక్టోబర్-నవంబర్ లో జరుగబోయే టీ20 ప్రపంచ కప్ తర్వాత తాను రిటైర్మెంట్ తీసుకుంటానని ఈ ఏడాది మార్చిలో మలింగ ప్రకటించాడు. కానీ, పొట్టి ఫార్మాట్ లో శ్రీలంక కెప్టెన్ అయిన 36ఏళ్ల మలింగ.. తన నిర్ణయాన్ని మార్చుకోని ఆపై కూడా టీ20లో ఆడుతానని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘టీ20లో 4 ఓవర్లు.. నా నైపుణ్యంతో ఆడతా. టీ20లో బౌలర్ గా నెగ్గగలను.
ఒక కెప్టెన్ గా.. ప్రపంచంలో ఎన్నో టీ20లు ఆడాను. అంటే మరో రెండేళ్లు ఇలాగే నెగ్గుకరాగలననని నమ్మకం ఉంది’ అని మలింగ తన అభిప్రాయాలను వెలిబుచ్చాడు. అంతర్జాతీయ టీ20లో 100 వికెట్లు తీసిన బౌలర్ గా లసిత్ తన పేరిట లిఖించుకున్నాడు.