Sachin Tendulkar : ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్

ఏడు దేశాలకు చెందిన 24 మంది దిగ్గజ ప్లేయర్స్ తో గురువారం వన్ ఆఫ్ మ్యాచ్ లో సచిన్ నేతృత్వంలోని వన్ వరల్డ్ టీం.. యువరాజ్ సింగ్ వన్ ఫ్యామిలీ టీంపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Sachin Tendulkar

T20 Exhibition Match : క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టీ20 చారిటీ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. మళ్లీ పాతరోజులను గుర్తుకు తెచ్చాడు. క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ పేరు తెలియని వాళ్ల ఉండరు. గత కొన్నేళ్ల క్రితం సచిన్ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్డ్ అయ్యారు. అయితే, తాజాగా.. టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ఆడిన ఈ గ్రేట్ క్రికెటర్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో మరోసారి తన దమ్మును చూపాడు. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ లో వన్ వరల్డ్ జట్టుకు సచిన్ కెప్టెన్ గా వ్యవహరించాడు. టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ వన్ ఫ్యామిలీ టీంకు నాయకత్వం వహించాడు. అయితే, సచిన్ టెండూల్కర్ జట్టు యువరాజ్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Also Read : Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరానికి సెలబ్రిటీలు ఎంతెంత ఇచ్చారో తెలుసా?

బెంగళూరులోని సత్యసాయి గ్రామం ముద్దెనహళ్లి క్రికెట్ స్టేడియంలో ఈ చారిటీ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన యువరాజ్ నాయకత్వం వహించిన వన్ ఫ్యామిలీ ఆరు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఆ తరువాత వన్ వరల్డ్ జట్టు బ్యాటింగ్ చేసింది. సచిన్ టెండూల్కర్ క్రీజులోకి వచ్చిన సమయం నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.. వరుస ఫోర్లతో అదరగొట్టాడు. మూడు ఫోర్లు, ఒక సిక్స్ తో 16 బంతుల్లో 27 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడుతున్న సచిన్ టెండూల్కర్ ను శ్రీలంక లెజెండ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఔట్ చేశాడు.

Also Read : సూప‌ర్ ఓవ‌ర్‌లో రోహిత్ శ‌ర్మ తొండాట‌..! ఆకాశ్ చోప్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సచిన్ బౌలింగ్ లోనూ రాణించాడు. రెండు ఓవర్లు వేసిన అతను.. 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ప్రమాదకరమైన బ్యాట్స్ మెన్ డారెన్ మాడీ వికెట్ తీుకున్నాడు. చాలాకాలం తరువాత క్రికెట్ మ్యాచ్ ఆడుతూ కనిపించిన సచిన్ ను చూసి అభిమానులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఏడు దేశాలకు చెందిన 24 మంది దిగ్గజ ప్లేయర్స్ ఈ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచిన్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్న వీడియోను స్టార్ స్పోర్ట్స్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Also Read : Virat Kohli : మ‌రోసారి బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్న కోహ్లీ.. స్పీచ్ అదిరిపోయింది