Headingley : వాట్ ఏ క్యాచ్, అద్భుతంగా పట్టాడు..కానీ క్రికెటర్ కాదు

బ్యాట్స్ మెన్ కొట్టిన బంతిని ఓ వ్యక్తి ఎంతో సాహసం చేసి ఒడిసిపట్టాడు. వావ్..వాట్ ఏ క్యాచ్..ఏం పట్టాడురా..అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు.

Cricket

Liam Livingstone : క్రికెట్ లో అప్పుడప్పడు కొన్ని విశేషాలు జరుగుతుంటాయి. ఫీల్డింగ్, బ్యాటింగ్ విషయంలో క్రికెటర్లు చేసే విన్యాసాలు అందర్నీ అబ్బురపరుస్తుంటాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. బ్యాట్స్ మెన్ కొట్టిన బంతిని ఓ వ్యక్తి ఎంతో సాహసం చేసి ఒడిసిపట్టాడు. వావ్..వాట్ ఏ క్యాచ్..ఏం పట్టాడురా..అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. అయితే..అతను క్రికెటర్ మాత్రం కాదు. ఈ ఘటన ఇంగ్లండ్ లో చోటు చేసుకుంది.

Read More :  Warn to Judge: సెప్టెంబరు13న చంపేస్తా,చేతనైతే తప్పించుకో..జడ్జికి వార్నింగ్ లేఖ

ఇంగ్లండ్ వేదికగా హండ్రెడ్ టోర్నీ జరుగుతోంది. లియామ్ లివింగ్ స్టోన్ భారీ సిక్సర్లతో ప్రత్యర్థులపై విరుచుకపడుతున్నాడు. దాదాపు పది సిక్స్ లు కొట్టాడితను. అయితే లివింగ్ స్టన్ కొట్టిన ఓ భారీ సిక్స్ ప్రేక్షకులు కూర్చొనే స్టాండ్ లోకి దూసుకొచ్చింది. బంతి స్టాండ్ లోకి వస్తుందని చూసిన ఓ వ్యక్తి…బంతిని అందుకోబోయాడు. సీటుపై నుంచి కిందపడిపోయాడు. కానీ..బంతిని మాత్రం చేతిలో ఒడిసిపట్టుకున్నాడు. సూపర్ గా డైవ్ చేస్తూ..క్యాచ్ పట్టుకున్న దృశ్యం..అక్కడి వీడియోలో కనిపించింది. దీంతో ఇతర ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Read More : Taliban Block Afghans: అప్ఘాన్లను సరిహద్దుల్లో అడ్డుకుంటున్న తాలిబన్లు

ఇక మ్యాచ్ విషయానికి వస్తే…తొలుత సూపర్ ఛార్జర్స్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. జట్టు ఓపెనర్లు క్రిస్ లిన్ (34), టామ్ కోహ్లర్ (71) రాణించారు. మిగతా జట్టు సభ్యులు విఫలం చెందారు. దీంతో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు ఫీనిక్స్ జట్టు ఓపెనర్లు క్రీజులోకి వచ్చారు. ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ విల్ స్మీడ్ పరుగులు తీయకుండానే..వెనుదిరిగాడు. అప్పుడే క్రీజులోకి వచ్రిన లివింగ్ స్టోన్ విశ్వరూపం చూపెట్టాడు. బౌలర్లపై విరుచుకపడుతూ..సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇతనికి ఫిన్ అలెన్ (42) చక్కటి సహకారం అందించాడు. కేవలం 74 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.