IPL 2024 : లక్నో బోణీ కొట్టింది.. పంజాబ్‌పై 21 పరుగుల తేడాతో తొలి విజయం.. ధావన్ కష్టం వృథా!

LSG vs PBKS : లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్ పై 21 పరుగుల తేడాతో తొలి విజయాన్ని అందుకుంది. పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీతో విజృంభించినప్పటికీ లక్ష్య ఛేదనలో అతడి పోరాటం వృథా అయింది.

LSG vs PBKS_ Shikhar Dhawan's valiant effort in vain as Lucknow pull off maiden win of IPL 2024

LSG vs PBKS :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. శనివారం (మార్చి 30) ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన 11వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 21 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై గెలిచి మొదటి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 భారీ స్కోరు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు పంజాబ్‌కు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Read Also : IPL 2024 : క్రిస్ గేల్, ఎంఎస్ ధోనీ రికార్డులను బ్రేక్ చేసిన ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ

ధావన్ హాఫ్ సెంచరీ వృథా :
ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులకే చేతులేత్తేసింది. పంజాబ్ ఓపెనర్ కెప్టెన్ శిఖర్ ధావన్ ( 50 బంతుల్లో, 3 సిక్సులు, 7 ఫోర్లు)తో 70 హాఫ్ సెంచరీ, జానీ బెయిర్ స్టో (29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు)తో 42 పరుగులతో ఇరువురు అద్భుతంగా రాణించారు. జానీ బెయిర్‌స్టో ఓపెనింగ్ వికెట్‌కు 100కు పైగా పరుగులు జోడించారు. అయితే, ధావన్ హాఫ్ సెంచరీ వృథా అయింది. జట్టును విజయ తీరాలకు చేర్చడంలో తన వంతు కృషిచేశాడు. కానీ, అతడి ప్రయత్నం ఫలించలేదు.

అదరగొట్టిన మయాంక్‌ యాదవ్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు :
మిగతా ఆటగాళ్లలో ప్రభసిమ్రాన్ సింగ్ (19), జితేశ్ శర్మ (6), లియామ్ లివింగ్ స్టోన్ (28), శశాంక్ సింగ్ (9) పరుగులకే పరిమితం కాగా, సామ్ కరన్ ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దాంతో పంజాబ్ ఓటమిని చవిచూసింది. లక్నో బౌలర్లలో అరంగేట్ర ఆటగాడు మయాంక్ యాదవ్ ఏకంగా (3/27) వికెట్లు పడగొట్టగా, మొహ్సిన్ ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అయితే, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ స్పెల్‌లు లక్నోకు అద్భుతమైన విజయాన్ని అందించాయి. మయాంక్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

డికాక్ హాఫ్ సెంచరీ :
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 199 పరుగులు చేయగా, క్వింటన్ డికాక్ (38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు)తో 54 హాఫ్ సెంచరీ నమోదు చేయగా, కెప్టెన్ నికోలస్ పూర్ (42), కృనాల్ పాండ్యా (43) పరుగులతో రాణించారు.

మిగతా లక్నో ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (15), మార్కస్ స్టోయినిస్ (19), దేవదత్ పడిక్కల్ (9), ఆయుష్ బదోని (8), మొహ్సిన్ ఖాన్ (2), రవి బిష్ణోయ్ ఖాతానే తెరవలేదు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టగా, అర్జీవ్ సింగ్ రెండు వికెట్లు, కగిసో రబడ, రాహుల్ చాహర్ తలో వికెట్ తీసుకున్నారు.

Read Also : IPL 2024 : ఐపీఎల్ టికెట్లపై సైబర్ మోసాలు.. తస్మాత్ జాగ్రత్త..!

ట్రెండింగ్ వార్తలు