IPL 2024 : క్రిస్ గేల్, ఎంఎస్ ధోనీ రికార్డులను బ్రేక్ చేసిన ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ 2008 సంవత్సరంలో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే కొనసాగుతున్నాడు.

IPL 2024 : క్రిస్ గేల్, ఎంఎస్ ధోనీ రికార్డులను బ్రేక్ చేసిన ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ

Virat Kohli Broke

Virat Kohli IPL 2024 : ఐపీఎల్ – 2024 టోర్నీలో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు విజయం సాధించింది. అయితే, ఆర్సీబీ జట్టు బ్యాటర్ విరాట్ కోహ్లీ 50 బంతుల్లో 83 పరుగులు చేశాడు. అందులో నాలుగు సిక్స్ లు ఉన్నాయి. దీంతో సిక్సర్లలో క్రిస్ గేల్, ఎంఎస్ ధోనీ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

Also Read : KKR vs RCB : అయ్యో ఆర్సీబీ.. 2016 నుండి కొనసాగుతున్న కేకేఆర్ విజయాల పరంపర

విరాట్ కోహ్లీ 2008 సంవత్సరంలో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే కొనసాగుతున్నాడు. ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ మొత్తం 241 సిక్సులు కొట్టాడు. దీంతో ఆర్సీబీ జట్టు తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు. ఆర్సీబీ తరపున కోహ్లీ మొత్తం 241 సిక్సులు కొట్టగా, క్రిస్ గేల్ 239 సిక్సులు కొట్టాడు. ఏబీ డివిలియర్స్ 238, గ్లెన్ మాక్స్ వెల్ 67, ఫాఫ్ డు ప్లెసిస్ 50 సిక్సులు కొట్టారు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన వారిలో కోహ్లీ నాల్గో స్థానంలో ఉన్నాడు.

Also Read : కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం.. కోహ్లీ, గంభీర్ ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన వారిలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ మొత్తం 357 సిక్సులు కొట్టాడు. ఆ తరువాతి స్థానంలో రోహిత్ శర్మ (261), ఏబీ డివిలియర్స్ (251), విరాట్ కోహ్లీ (241), ఎంఎస్ ధోనీ (239) సిక్సులు కొట్టాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ నాలుగు సిక్సులు కొట్టాడు. దీంతో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ల జాబితాలో ఎంఎస్ ధోనీని విరాట్ కోహ్లీ దాటిపోయాడు. మరోవైపు ఐపీఎల్ 2024 టోర్నీలో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ జట్టు ఆడిన మూడు మ్యాచ్ లలో కోహ్లీ 181 పరుగులు చేశాడు. తద్వారా ఎస్ఆర్ హెచ్ హెన్రిచ్ క్లాసెన్ ను దాటి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు.