IPL 2023, PBKS vs LSG: పంజాబ్ చిత్తు.. ల‌క్నో ఘ‌న విజ‌యం.. పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానం

IPL 2023, PBKS vs LSG:ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఘ‌న విజ‌యం సాధించింది.

LSG win(pic ipl)

IPL 2023, PBKS vs LSG: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఘ‌న విజ‌యం సాధించింది. భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన పంజాబ్ 19.5 ఓవ‌ర్ల‌లో 201 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. దీంతో ల‌క్నో 56 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో అథర్వ తైదే(66; 36 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. ల‌క్నో బౌలర్ల‌లో యష్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీయ‌గా నవీన్-ఉల్-హక్ మూడు, ర‌వి బిష్ణోయ్ రెండు, మార్క‌స్ స్టోయిస్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

IPL 2023, PBKS vs LSG: పంజాబ్‌పై ల‌క్నో ఘ‌న విజ‌యం

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 257 ప‌రుగులు చేసింది. మార్క‌స్ స్టోయినిస్‌(73; 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), కైల్ మేయ‌ర్స్‌(54; 24 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) లు దంచికొట్ట‌గా నికోల‌స్ పూర‌న్‌(45; 18 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఆయుష్ బ‌దోని(43; 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) విధ్వంసం సృష్టించారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో ర‌బాడ రెండు వికెట్లు తీయ‌గా, అర్ష్ దీప్ సింగ్, సామ్ క‌ర‌న్‌, లివింగ్ స్టోన్ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

IPL: ఐపీఎల్‌ చ‌రిత్ర‌లో టాప్-5 స్కోర్లు ఇవే

పంజాబ్ పై విజ‌యం సాధించ‌డంతో ఐపీఎల్ పాయింట్ల ప‌ట్టిక‌లో ల‌క్నో రెండో స్థానానికి చేరింది.

ట్రెండింగ్ వార్తలు