Team India : రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ‌..?

ఓట‌మి బాధ‌లో ఉన్న భార‌త జ‌ట్టుకు పెద్ద ఎదురుదెబ్బ త‌గిలేలా ఉంది.

Team India

IND vs SA : ఓట‌మి బాధ‌లో ఉన్న భార‌త జ‌ట్టుకు పెద్ద ఎదురుదెబ్బ త‌గిలేలా ఉంది. కేప్‌టౌన్‌లో జ‌న‌వ‌రి 3న ద‌క్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌కు పేస్ ఆల్‌రౌండ‌ర్ శార్దూల్ ఠాకూర్ దూరం అయ్యే అవ‌కాశం ఉంది. శ‌నివారం నెట్స్‌లో ప్రాక్టీస్ట్ చేస్తుండ‌గా శార్దూల్ గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా అత‌డి భుజానికి గాయ‌మైంది. అయితే.. గాయం తీవ్రమైన‌దా..? కాదా..? అన్న సంగ‌తి ప్ర‌స్తుతానికి తెలియ‌రాలేదు.

అయితే.. ఠాకూర్ చాలా అసౌక‌ర్యానికి గురైయ్యాడు. నెట్ సెష‌న్‌లో అత‌డు బౌలింగ్ చేయ‌లేక‌పోయాడు. బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్ నుంచి త్రోడౌన్ల‌ను ఎదుర్కొంటున్న‌ప్పుడు ఠాకూర్ ఎడ‌మ భుజానికి బంతి బ‌లంగా త‌గిలింది. దీంతో అత‌డు నొప్పితో విల‌విల‌లాడాడు. కాసేప‌టి త‌రువాత త‌న బ్యాటింగ్ సెష‌న్‌ను కొన‌సాగించాడు. సెష‌న్ ముగిసిన త‌రువాత ఫిజియో వ‌చ్చి శార్దూల్ భుజం చుట్టూ ఐస్ ప్యాక్ స్లింగ్‌ను ఉంచాడు. ఇది సాధార‌ణ గాయమా..? ఎన్ని రోజుల్లో త‌గ్గుతుంది అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

Rohit Sharma : మాకు ఎలా బ్యాటింగ్ చేయాలో తెలుసు.. మీరు కాస్త వాటిని చూసి మాట్లాడండి..!

ఒక‌వేళ శార్దూల్ గాయం కార‌ణంగా రెండో టెస్టుకు దూరం అయితే భార‌త్‌కు ఇది గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్పవ‌చ్చు. మొద‌టి టెస్టు మ్యాచ్‌లోని తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్ 24 ప‌రుగులు రెండో ఇన్నింగ్స్‌లో రెండు ప‌రుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 19 ఓవ‌ర్లు వేసిన శార్దూల్ కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే ప‌డ‌గొట్టి 101 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

జ‌న‌వ‌రి 3న కేప్‌టౌన్ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మొద‌టి టెస్టు మ్యాచులో గెలిచిన సౌతాఫ్రికా రెండో మ్యాచులోనూ గెలిచిన భార‌త్‌ను వైట్ వాష్ చేయాల‌ని భావిస్తోండ‌గా క‌నీసం రెండో టెస్టులోనైనా విజ‌యం సాధించి సిరీస్‌ను స‌మం చేయాల‌ని భార‌త్ ప‌ట్టుద‌ల‌గా ఉంది.

IND vs SA 2nd Test : రెండో టెస్టుకు ముందు ద‌క్షిణాఫ్రికాకు భారీ షాక్‌.. ఇంత‌కంటే మంచి అవ‌కాశం భార‌త్‌కు దొర‌క‌దు

ట్రెండింగ్ వార్తలు