Manav Suthar : మానవ్ సుతార్.. నువ్వు తోపు బ్రో.. 94 ఏళ్ల చరిత్రలో ఆ రికార్డు కొట్టిన సెకండ్ ప్లేయర్

మానవ్ సుతార్ (Manav Suthar ) అంచనాలకు మించి రాణించి సరికొత్త రికార్డులను సృష్టించాడు.

Manav Sutar great achievement on his Test debut he is the 2nd Indian spinner to achieve the best record in last 94 years

Manav Suthar : ఇటీవలి కాలంలో ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో నాణ్యమైన ఎడమచేతి వాటం స్పిన్నర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ముల్లన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఆ లోటును భర్తీ చేయగలననే నమ్మకాన్ని కలిగించాడు. పిచ్ నుంచి పెద్ద‌గా స‌హ‌కారం లేకున్నా కూడా త‌న అద్భుత‌మైన బౌలింగ్ యాక్ష‌న్‌తో బంతిని స్పిన్ చేస్తూ వికెట్లు ప‌డ‌గొట్టి అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో మానవ్ సుతార్ అంచనాలకు మించి రాణించి సరికొత్త రికార్డులను సృష్టించాడు. మ్యాచ్ రెండో రోజు నుంచే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచిన అతను.. ఆదివారం తన తొలి ఓవర్‌లోనే అఫ్గాన్ ఓపెనర్ అబ్దుల్ మాలిక్ వికెట్‌ను పడగొట్టాడు. ఆ తర్వాత ప్రమాదకరమైన రహ్మనుల్లా గుర్బాజ్, అఫ్సర్ జజాయ్‌ల వికెట్లు తీసి అఫ్గాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. అదే ఊపును మూడో రోజైన సోమ‌వారం కూడా కొన‌సాగించాడు.

*Tilak Varma : 8 కోట్ల ప్లేయ‌ర్‌ను 33 ల‌క్ష‌ల‌కే కొంటారా? ఇది అన్యాయం గురూ!

క్రీజులో నిలదొక్కుకున్న రహ్మత్ షాను, షరాఫుద్దీన్‌ల‌తో పాటు మ‌హ్మ‌ద్ స‌లీమ్‌ను ఔట్ చేయ‌డం ద్వారా ఇన్నింగ్స్‌లో ఆరో వికెట్ ను ద‌క్కించుకున్నాడు. మొత్తంగా.. ఈ ఇన్నింగ్స్‌లో మాన‌వ్ సుతార్ 22 ఓవర్లు వేశాడు. కేవ‌లం 33 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ఆరు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అత‌డు వేసిన 22 ఓవ‌ర్ల‌లో 10 ఓవ‌ర్లు మెయిడెన్లు కావ‌డం విశేషం.

ఈ అసాధారణ ప్రదర్శనతో భారతదేశ 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో.. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 10వ భారతీయ బౌలర్‌గా మానవ్ సుతార్ నిలిచాడు. అంతేకాకుండా.. అరంగేట్రంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండవ భార‌త స్పిన్నర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ జాబితాలో న‌రేంద్ర హిర్వానీ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌డు 16 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

*Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ వ‌చ్చినా వైభ‌వ్ సూర్య‌వంశీ అసంతృప్తి.. ల‌క్ష్యం చాలా పెద్ద‌దే భ‌య్యా.. రెండు కాదు ఏకంగా 5 కు గురి..

అరంగ్రేట‌ టెస్టు మ్యాచ్‌ల్లో భార‌త స్పిన్న‌ర్ల టాప్‌-5 ప్ర‌ద‌ర్శ‌న‌లు..

  1. న‌రేంద్ర హిర్వానీ – 1988లో వెస్టిండీస్ పై 8/61, 8/75
  2. మాన‌వ్ సుతార్ – 2026లో అఫ్గాన్ పై 6/33
  3. దిలీప్ దోషి – 1979లో ఆస్ట్రేలియాపై 6/103
  4. ర‌విచంద్ర‌న్ అశ్విన్ – 2011లో వెస్టిండీస్ పై 6/47
  5. అక్ష‌ర్ ప‌టేల్ – 2021లో ఇంగ్లాండ్ పై 5/60