Paris Olympics 2024 : హార్ట్ బ్రేకింగ్‌.. మ‌ను భాక‌ర్ ఓట‌మి.. తృటిలో చేజారిన ప‌త‌కం..

పారిస్ ఒలింపిక్స్‌లో మూడో మెడ‌ల్ గెలిచే అవ‌కాశాన్ని మ‌ను భాక‌ర్ తృటిలో కోల్పోయింది.

Manu Bhaker misses historic third medal at Paris Olympics

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో మూడో మెడ‌ల్ గెలిచే అవ‌కాశాన్ని మ‌ను భాక‌ర్ తృటిలో కోల్పోయింది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. క్వాలిఫైయింగ్ ఈవెంట్‌లో అద‌ర‌గొట్టిన మ‌ను.. ఫైన‌ల్‌లోనూ అదే జోరును కొన‌సాగించింది. అయితే.. ఆఖ‌రికి నాలుగో స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. టాప్‌-3లో నిలిచి ఉంటే ఆమెకు ప‌త‌కం ద‌క్కి ఉండేది. కాగా.. ఇప్ప‌టికే పారిస్ ఒలింపిక్స్‌లో మ‌ను రెండు కాంస్య ప‌త‌కాలు గెలిచిన సంగ‌తి తెలిసిందే.

స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా మ‌ను రికార్డుల‌కు ఎక్కింది. వ్య‌క్తిగ‌త విభాగం 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్‌లో మ‌ను భాక‌ర్ కాంస్య ప‌త‌కాన్ని గెలుపొంది. అదే విధంగా మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్‌తో క‌లిస మ‌ను బాక‌ర్ కాంస్యాన్ని ముద్దాడింది. ముచ్చ‌ట‌గా మూడో ప‌త‌కాన్ని సాధించాలి అనుకున్న మ‌నుకు నిరాశే ఎదురైంది.

Rohit Sharma : కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ ప్ర‌పంచ రికార్డు.. సిక్స‌ర్ల కింగ్..

ఇదిలా ఉంటే.. కెరీర్‌లో మాత్రం ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఇద్దరు ఉన్నారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజత పతకంను రెజ్లర్ సుశీల్ సాధించాడు. బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది.

ట్రెండింగ్ వార్తలు