Marnus Labuschagne : ప‌క్షిలా గాల్లోకి ఎగిరి.. ఒంటి చేత్తో అద్భుత క్యాచ్‌.. మీ క‌ళ్ల‌ని మీరే న‌మ్మ‌లేరు.

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు ఫీల్డ‌ర్లు చేసే విన్యాసాలు చూస్తే మ‌న క‌ళ్ల‌ను మ‌న‌మే న‌మ్మ‌లేము.

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు ఫీల్డ‌ర్లు చేసే విన్యాసాలు చూస్తే మ‌న క‌ళ్ల‌ను మ‌న‌మే న‌మ్మ‌లేము. తాజాగా అలాంటి ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ వేదిక‌గా జ‌రుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో ఆస్ట్రేలియా ఆట‌గాడు మార్న‌స్ లబుషేన్ న‌మ్మ‌శ‌క్యం కానీ విధంగా క్యాచ్ ను అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఆస్ట్రేలియా ఆట‌గాడు మార్న‌స్ లబుషేన్ ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్‌లో గ్లామోర్గాన్ త‌రుపున ఆడుతున్నాడు. గురువారం కార్డిఫ్‌ వేదికగా గ్లోసెస్టర్‌షైర్‌తో గ్లామోర్గ‌న్ త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లోనే ల‌బుషేన్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. మేస‌న్ క్రేన్ బౌలింగ్‌లో గ్లోసెస్టర్‌షైర్ ఆట‌గాడు బెన్‌ ఛార్లెస్‌వర్త్‌ లాంగ్‌ ఆన్‌ దిశగా భారీ షాట్ ఆడాడు. చాలా దూరం నుంచి ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చిన ల‌బుషేన్ క‌ళ్లు చెదిరే రీతిలో బంతిని అద్భుతంగా ఒడిసిప‌ట్టుకున్నాడు.

Pat Cummins : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌2024లో తొలి హ్యాట్రిక్‌.. బంగ్లాదేశ్ పై పాట్ క‌మిన్స్ ఘ‌న‌త‌..

ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి త‌న కుడి చేతి వైపు గాల్లో ప‌క్షిలా ఎగురుతూ ఒంతిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. తాము చూసిన అత్యుత్త‌మ క్యాచుల్లో ఇది ఒక‌టి అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ఉత్కంఠభ‌రితంగా సాగిన మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్‌ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. గ్లోసెస్టర్‌షైర్ విజ‌యానికి ఆఖ‌రి బంతికి 5 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. ఆఖ‌రి బంతికి బ్యాట‌ర్ సిక్స్ బాదాడు. ఈ మ్యాచ్‌లో మొద‌ట‌ బ్యాటింగ్‌ చేసిన గ్లామోర్గన్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ల‌క్ష్యాన్ని గ్లోసెస్టర్‌షైర్ స‌రిగ్గా 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

VVS Laxman : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌..! జింబాబ్వే ప‌ర్య‌టన‌కు..!

ట్రెండింగ్ వార్తలు