Tokyo Olympics 2020 : ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించిన మేరీకోమ్.. కన్నీటిపర్యంతం

: టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ గేమ్స్ నుంచి భారత బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ నిష్క్రమించారు. 48-51 కిలోల విభాగంలో జరిగిన మ్యాచ్ లో ఆమె పోరాడి ఓడింది. కొలంబియా క్రీడాకారిణి వలెన్షియా విక్టోరియా ఇంగ్రీట్ లొరనా చేతిలో 2-3 చేదతో పరాయం పాలైంది కోమ్

Tokyo Olympics 2020 : 38 ఏళ్ల వయసు.. బాక్సింగ్ లో 20 ఏళ్ల అనుభవం. ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్, ఐదు సార్లు ఆసియా విజేత, ఓ సారి ఒలింపిక్ కాంస్యపతకం గెలిచిన భారత మాత ముద్దుబిడ్డ మేరీకోమ్.. కోమ్ ఒలింపిక్స్ బంగారు పతకంతో తన కెరియర్ ముగించాలని అందుకుంది. కానీ ఆమె ఆశలు అడియాశలయ్యాయి. గురువారం టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ ఫ్రీక్వార్టర్స్ మ్యాచ్ లో కోమ్, కొలింబియా బాక్సర్ ఇన్‌గ్రిట్ విక్టోరియాతో తలపడిన పరాజయంపాలైంది.

హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో 2-3 తేడాతో ఓటమి చవిచూశారు. మ్యాచ్ అనంతరం రిఫరీ ప్రత్యర్థి చేయిలేపడంతో ఆమె ఒక్కసారిగా ఉద్వేగానికి గురైంది. రింగ్ లోనే కన్నీరుపెట్టుకుంది. 51 కేజీల విభాగంలో భారత్ తరపున బలమైన బాక్సర్ గా ఉన్నారు కోమ్.. టోక్యోలో ఒలంపిక్స్ లో బంగారు పథకం సాధించి భరతమాత మేడలో వేయాలని కళలు కన్న కోమ్.. ఊహించని ఓటమితో నిరాశకు గురయ్యారు. కాగా ప్రత్యర్థి ఇన్‌గ్రిట్ విక్టోరియా 2016 రియో ఒలింపిక్స్ లో కాంస్యపతకం సాధించారు.

ఈ పోరులో 27-30, 28-29, 30-27, 28-29, 29-28 కోమ్ ఓటమి చవిచూశారు. ఇక మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రిఫరీ ఇన్‌గ్రిట్ విక్టోరియా చేతిని పైకి ఎత్తారు. ఈ సమయంలో కోమ్ ఓ పక్క నవ్వుతోనే మరోవైపు కన్నీటిని ఆపుకోలేక బోరుమని విలపించారు.

ట్రెండింగ్ వార్తలు