Matthew Renshaw : ఒక్క బంతికే 7 ప‌రుగులు.. సిక్స్ కొట్ట‌లేదు.. ఇదేలా సాధ్యం.. వీడియో వైర‌ల్‌

Matthew Renshaw 7 runs in single ball : క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు కొన్ని విచిత్ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి.

Matthew Renshaw 7 runs in single ball

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు కొన్ని విచిత్ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి. ఒక్క బంతికే ఓ బ్యాట‌ర్ ఏడు ప‌రుగులు సాధించాడు. అయితే ఆ బాల్స్ సిక్స్ కూడా వెళ్ల‌లేదు గానీ బ్యాట‌ర్ ఖాతాలో ఏడుగురు ప‌రుగులు వ‌చ్చి చేరాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్‌, ప్రైమ్ మినిస్ట‌ర్స్ ఎలెవ‌న్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచులో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. రెండు టెస్టు మ్యాచుల సిరీస్ కోసం పాకిస్తాన్ జ‌ట్టు ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టిస్తోంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కాన్‌బెర్రా వేదిక‌గా ప్రైమ్ మినిస్ట‌ర్స్ ఎలెవ‌న్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌ ఆడుతోంది. మూడో రోజు ఆట‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రైమ్ మినిస్ట‌ర్స్ బ్యాటింగ్ చేస్తుండ‌గా ఇన్నింగ్స్ 24వ ఓవ‌ర్‌ను స్పిన్న‌ర్ అబ్రార్ అహ్మ‌ద్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఐదో బంతిని ఆసీస్ బ్యాట‌ర్ రెన్షా క‌వ‌ర్స్ దిశ‌గా షాట్ ఆడాడు. బంతి బౌండ‌రీ దిశ‌గా వెళ్లింది.

Glenn Maxwell : ఆర్‌సీబీ అభిమానుల‌కు షాక్‌.. మాక్స్‌వెల్‌కు గాయం.. ఐపీఎల్ 2024 ఆడేది అనుమానం..?

పాకిస్తాన్ ఆట‌గాడు మీర్ హమ్జా అద్భుతంగా డైవ్ చేసి బంతి బౌండ‌రీ చేర‌కుండా అడ్డుకున్నాడు. అనంత‌రం బాల్‌ను బౌలింగ్ ఎండ్ వైపు విసిరేశాడు. అప్ప‌టికే ఆసీస్ బ్యాట‌ర్లు మూడు ప‌రుగులు పూర్తి చేశాడు. బంతిని అందుకున్న బాబ‌ర్ ఆజాం చాలా వేగంతో బంతిని కీప‌ర్ వైపు విసిరివేశాడు. ఆ బంతి కీప‌ర్‌, ఫ‌స్ట్ స్లిప్స్‌లో ఉన్న ఆట‌గాడికి అంద‌కుండా బౌండ‌రీ లైన్‌కు దూసుకువెళ్లింది. దీంతో ఒక్క బంతికే రెన్షా ఖాతాలో ఏడు ప‌రుగులు వ‌చ్చి చేరాయి.

ఈ వీడియో వైర‌ల్‌గా మారగా.. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

అంత‌క‌ముందు పాకిస్తాన్ కొత్త కెప్టెన్ మూడో డబుల్ సెంచరీ(201 నాటౌట్‌) చేశాడు. దీంతో పాకిస్తాన్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 391 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కాగా.. డిసెంబ‌ర్ 14 నుంచి పెర్త్ వేదిక‌గా భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

MS Dhoni : 20 కిలోల బ‌రువు త‌గ్గితే ఐపీఎల్‌లో తీసుకుంటాన‌న్న ధోని.. కానీ అతడు మాత్రం..

ట్రెండింగ్ వార్తలు