Marcus Stoinis
మెల్‌బోర్న్ స్టార్స్ కొత్త సంవత్సరానికి అపూర్వ స్వాగతం పలికింది. బిగ్‌బాష్ లీగ్‌లో ఆ జట్టు అడిలైడ్ స్ట్రైకర్స్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ (55 నాటౌట్; 19 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) పెను విధ్వంసం సృష్టించడంతో 206 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మెల్‌బోర్న్ బ్యాటర్లలో డానియల్ లారెన్స్ (50; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్యూ వెబ్‌స్టర్ (66 నాటౌట్; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేశారు. కాగా.. బిగ్‌బాష్ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగుల ఛేదనలో ఇది ఒకటి కావడం విశేషం.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అడిలైడ్‌కు ఓపెనర్లు షార్ట్ (25; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్)తో కెప్టెన్ మాథ్యూ షార్ట్ (56; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మొదటి వికెట్‌కు 44 పరుగులు జోడించి శుభారంభం అందించారు. షార్ట్ ఔటైన తరువాత పవర్ ప్లే ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన క్రిస్‌లిన్ (83 నాటౌట్; 42 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు)తో మాథ్యూ తో కలిసి స్కోరు బోర్డు ముందుకు నడిపించాడు.
Warner : కొత్త సంవత్సరంలో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్న ఆటగాళ్లు ఎవరో తెలుసా..?
ముఖ్యంగా క్రిస్‌లిన్ బౌలర్లపై విరుచుపడ్డాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. అర్ధశతకం తరువాత మాథ్యూ ఔటైన క్రిస్‌లిన్ ఆఖరి వరకు దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో అడిలైడ్ స్ట్రైకర్స్ స్కోరు రెండు వందలు దాటింది. మెల్‌బోర్న్ బౌలర్లలో మాక్స్‌వెల్ రెండు వికెట్లు తీశారు. జోయెల్, కోరి చెరో వికెట్ పడగొట్టారు.
6 ఓవర్లలో 69 పరుగులు..
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ థామస్ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. వెబ్‌స్టర్‌తో కలిసి డేనియల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఇద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదాడు. ఇద్దరూ అర్థశతకాలను పూర్తి చేసుకున్నారు. డేనియల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్ (28; 17 బంతుల్లో 5 ఫోర్లు) ఓ చేయి వేశాడు.
MS Dhoni : దుబాయ్‌లో ధోని విహారయాత్ర..! పిక్స్ వైరల్.. కృతిసనన్, నుపుర్ సనన్, సాక్షి ఇంకా..
కాగా.. మాక్స్‌వెల్ ఔటైయ్యే సమయానికి మెల్‌బోర్న్ విజయసమీకరణం ఆరు ఓవర్లలో 69 పరుగులుగా ఉంది. ఈ తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన మార్కస్ స్టొయినిస్ పెను విధ్వంసం సృష్టించాడు. వచ్చిన బంతిని వచ్చినట్లుగా బౌండరీకి తరలించాడు. స్టొనియిస్ విధ్వంసంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే మెల్‌బోర్న్ విజయాన్ని అందుకుంది.