Shubman Gill : ఆక్సిజన్ ఫార్ములాకి గిల్ బ్యాటింగ్‌కి సంబంధం ఏమిటి..? శుభ్‌మన్ పై మీమ్స్ వైరల్
Memes on Shubman Gill : టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- December 13, 2023 / 04:09 PM IST
Memes on Shubman Gill
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచులో అతడు రెండు బంతులు ఎదుర్కొని డకౌట్ కావడమే అందుకు కారణం. అదేంటి..? ఒక్క మ్యాచులో డకౌట్ అయినంత మాత్రన అతడిని ట్రోలింగ్ చేస్తారా..? అంటే కాదు.. విదేశాల్లో అతడి ప్రదర్శననే అందుకు కారణంగా తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీతో పాటు టీమ్ఇండియా తరుపున లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్‌ను కాదని గిల్ ను తీసుకున్న టీమ్ఇండియా మేనేజ్మెంట్ అందుకు తగిన మూల్యం చెల్లించుకుందని మండిపడుతున్నారు. అనారోగ్యం కారణంగా రుతురాజ్ మ్యాచ్‌కు అందుబాటులోకి లేడని అధికారులు చెప్పినప్పటికీ ఇది అంతగా నమ్మేటట్లుగా లేదంటున్నారు. టీ20 ప్రపంచకప్ ముందు టీమ్ఇండియా మరో నాలుగు మ్యాచులు మాత్రమే ఆడాల్సి ఉన్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
3,7,6,0..
విదేశీ గడ్డ పై టీమ్ఇండియా ఆడిన గత నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లో గిల్ వరుసగా 3,7,6,0 పరుగులు చేశాడు. నాలుగు మ్యాచుల్లో మొత్తంగా 16 పరుగులే చేశాడు. దీంతో ఫ్యాన్స్ గిల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడిపై ట్రోలింగ్ కు దిగుతున్నారు. ఆక్సిజన్ ఫార్ములా ఏంటి అని అడుగగా.. రేపు టీవీలో చూడు అని గిల్ చెప్పినట్లుగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. గిల్ రెండు బంతులు ఎదుర్కొని డకౌట్ కాగా.. ఆక్సిజన్ ఫార్ములా O₂ అన్న సంగతి తెలిసిందే.
Rinku Singh : సిక్స్ కొట్టినందుకు క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్.. వీడియో వైరల్
