×
Ad

IND vs NZ : మేము ఎలా గెలిచామో తెలుసా.. న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్‌వెల్ కామెంట్స్ వైర‌ల్‌

రెండో వ‌న్డేలో విజ‌యం సాధించ‌డం ప‌ట్ల న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్ వెల్ (IND vs NZ) ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు

Michael Bracewell comments after New Zealand beat india in 2nd odi

  • రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ విజ‌యం
  • మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్ర‌స్తుతానికి 1-1తో స‌మం
  • ఆనందంలో కివీస్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్ వెల్

IND vs NZ : రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్ర‌స్తుతానికి 1-1తో స‌మం చేసింది. ఇక రెండో వ‌న్డేలో విజ‌యం సాధించ‌డం ప‌ట్ల న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్ వెల్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. టీమ్ఇండియాను త‌క్కువ స్కోరుకే ప‌రిమితం చేయ‌డంతోనే స‌గం విజ‌యం సాధించామ‌ని, ఇక బ్యాటింగ్‌లో డారిల్, యంగ్‌లు అద్భుతంగా ఆడి భార‌త్‌కు మ్యాచ్‌ను దూరం చేశార‌ని చెప్పుకొచ్చాడు.

ఇది జ‌ట్టు స‌మిష్టి విజ‌యం అని అన్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో త‌మ ఆట‌గాళ్లు అద్భుతంగా రాణించార‌ని చెప్పుకొచ్చాడు. త‌మ బౌల‌ర్లు చ‌క్క‌గా బౌలింగ్ చేసి భార‌త్‌ను త‌క్కువ స్కోరుకే ప‌రిమితం చేశార‌న్నాడు. భార‌త ఇన్నింగ్స్ ముగిసిన త‌రువాత తాము సంతోషంగా ఉన్నామ‌ని అన్నాడు. టీమ్ఇండియాను త‌క్కువ స్కోరుకు పరిమితం చేయ‌డంతో స‌గం మ్యాచ్‌ను గెలిచిన‌ట్లైంద‌న్నాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న‌ప్పుడే తాము ఎంత‌టి ల‌క్ష్యాన్ని అయినా ఛేదించ‌డానికి సిద్దంగా ఉన్నామ‌ని చెప్పుకొచ్చాడు.

Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ పై వ‌న్డేల్లో ఒకే ఒక భార‌తీయుడు..

టీమ్ఇండియా బౌల‌ర్లు మంచి ప్ర‌ద‌ర్శ‌న‌నే చేశార‌ని, అయితే.. త‌మ బ్యాట‌ర్లు ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా చ‌క్క‌గా ఆడార‌ని ప్ర‌శంసించాడు. ఒత్తిడిని చాలా బాగా ఎదుర్కొన్నాడ‌ని చెప్పాడు. డారిల్ మిచెల్‌, విల్ యంగ్‌ను భార‌త్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నార‌న్నాడు.

అంత సుల‌భం కాదు..

‘ప్లేయ‌ర్ల ఆట‌తీరు ప‌ట్ల చాలా గ‌ర్వంగా ఉన్నాము. ఇక అరంగ్రేట ప్లేయ‌ర్ జేడెన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక్కడికి వచ్చి అరంగేట్రం చేయడం ఎప్పుడూ సులభం కాదు. అందులోనూ పవర్‌ప్లేలో బౌలింగ్ చేయాల్సి వస్తే అది ఇంకా కష్టం. కాబట్టి అతను ఆ పరిస్థితిని ఎదుర్కొన్న తీరు అద్భుతంగా ఉందని నేను భావించాను. అతను చాలా మ్యాచ్‌లు ఆడినట్లుగా కనిపించాడు.’ అని బ్రేస్‌వెల్ అన్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. కేఎల్ రాహుల్ (112 నాటౌట్; 92బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 284 ప‌రుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (56) హాఫ్ సెంచ‌రీతో రాణించారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో క్రిస్టియన్ క్లార్క్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. కైల్ జేమీసన్, మైఖేల్ బ్రేస్‌వెల్, జకారీ ఫౌల్క్స్, జేడెన్ లెనాక్స్ లు త‌లా ఓ వికెట్ తీశారు.

Richest Indian cricketers : 2025లో టాప్ 5 ధ‌న‌వంతులైన భారత క్రికెటర్లు ఎవరు?

అనంత‌రం 285 ప‌రుగుల ల‌క్ష్యాన్ని న్యూజిలాండ్ 47.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. కివీస్ బ్యాట‌ర్ల‌లో డారిల్ మిచెల్ (131 నాటౌట్; 117 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) భారీ సెంచ‌రీ చేయ‌గా విల్ యంగ్ (87; 98 బంతుల్లో 7 ఫోర్లు ) రాణించాడు.