Ashwin : ధ‌ర్మ‌శాల‌లో సెంచ‌రీ కొట్ట‌బోతున్న అశ్విన్‌, బెయిర్ స్టో.. అరుదైన ఘ‌ట్టం

ధ‌ర్మ‌శాల వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఐదో టెస్ట్ మ్యాచ్ చ‌రిత్రలో నిలిచిపోనుంది.

Ashwin - Bairstow

Ashwin – Bairstow : ధ‌ర్మ‌శాల వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఐదో టెస్ట్ మ్యాచ్ చ‌రిత్రలో నిలిచిపోనుంది. ఇద్ద‌రు ప్లేయ‌ర్లకు (వేరువేరు దేశాల‌కు చెందిన వారు) ఇది వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఇలా జ‌ర‌గ‌డం ఇది మూడోసారి మాత్ర‌మే. టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ఇంగ్లాండ్ బ్యాట‌ర్ జానీ బెయిర్ స్టోలకు ఈ మ్యాచ్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిల‌వ‌నుంది.

అశ్విన్‌, జానీ బెయిర్ స్టోలు త‌మ కెరీర్‌లో ఆడ‌నున్న వందో టెస్టు మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో వీరిద్ద‌రు ఎలా రాణిస్తారు అన్న అంశంపై ఆస‌క్తి నెల‌కొంది. ఈ మ్యాచ్ ఎవ‌రికి తీపి గుర్తుగా మిగ‌ల‌నుందో మ‌రికొద్ది రోజుల్లో తేల‌నుంది.

IND vs ENG 5th Test : ఐదో టెస్టుకు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. బుమ్రా ఇన్‌.. రాహుల్ ఔట్‌.. ఇంకా

టీమ్ఇండియా త‌రుపున 13 మంది..

టీమ్ఇండియా త‌రుపున ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 13 మంది ఆట‌గాళ్లు మాత్ర‌మే టెస్టుల్లో వంద‌కు పైగా మ్యాచ్‌లు ఆడారు. అశ్విన్ 14వ ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్క‌నున్నాడు. భార‌త్ త‌రుపున అత్య‌ధిక టెస్టులు ఆడిన ఆట‌గాళ్ల జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. స‌చిన్ త‌న కెరీర్‌లో 200 టెస్టులు ఆడాడు. ఆ త‌రువాత 163 టెస్టుల‌తో టీమ్ఇండియా ప్ర‌స్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్ర‌విడ్ రెండో స్థానంలో ఉన్నాడు.

టెస్టుల్లో టీమ్ఇండియా త‌రుపున‌ వంద‌కు పైగా మ్యాచ్‌లు ఆడింది వీరే..

స‌చిన్ టెండూల్క‌ర్ – 200 టెస్టులు
రాహుల్ ద్ర‌విడ్ – 163
వీవీఎస్‌ లక్ష్మణ్ -134
అనిల్‌ కుంబ్లే – 132
కపిల్‌ దేవ్ – 131
సునీల్‌ గవాస్కర్ – 125
దిలీప్‌ వెంగ్‌సర్కార్ – 116
సౌరవ్‌ గంగూలీ – 113
విరాట్‌ కోహ్లీ – 113
ఇషాంత్‌ శర్మ – 105
హర్భజన్‌ సింగ్ – 103
ఛతేశ్వర్‌ పుజారా – 103
వీరేంద్ర సెహ్వాగ్ – 103 లు ఉన్నారు.

అశ్విన్ విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు 99 టెస్టులు ఆడాడు. 507 వికెట్లు ప‌డ‌గొట్టాడు. బ్యాటింగ్‌లో 3309 ప‌రుగులు చేశాడు. ఇటీవ‌ల ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 500 వికెట్ల క్ల‌బ్‌లో చేరాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 17 విక‌ట్లు తీశాడు.

బెయిర్ స్టో..

ఇంగ్లాండ్ త‌రుపున ఇప్పటి వ‌ర‌కు బెయిర్ స్టో 99 టెస్టులు ఆడాడు 36.43 స‌గ‌టుతో 5974 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 సెంచ‌రీలు, 26 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. కాగా.. భార‌త్‌తో జ‌ర‌గుతున్న సిరీస్‌లో బెయిర్ స్టో పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మౌతున్నాడు. మొద‌టి టెస్ట్‌లో 47 పరుగులు (37, 10), రెండో టెస్ట్‌లో 51 (25, 26), మూడో టెప్ట్‌లో 4 (0, 4), నాలుగో టెస్ట్‌లో 68 పరుగులు (30, 38) మాత్ర‌మే చేశాడు. ఒక్క‌సారి కూడా అర్ధ‌శ‌త‌కాన్ని అందుకోలేదు. ప్ర‌తిష్టాత్మక టెస్టులో సెంచ‌రీ చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Yashasvi Jaiswal : ఐదో టెస్టుకు ముందు య‌శ‌స్వి జైస్వాల్‌ను ఊరిస్తున్న రికార్డులు

ట్రెండింగ్ వార్తలు