Yashasvi Jaiswal : ఐదో టెస్టుకు ముందు య‌శ‌స్వి జైస్వాల్‌ను ఊరిస్తున్న రికార్డులు

టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు.

Yashasvi Jaiswal : ఐదో టెస్టుకు ముందు య‌శ‌స్వి జైస్వాల్‌ను ఊరిస్తున్న రికార్డులు

Yashasvi Jaiswal

Jaiswal : టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన నాలుగు మ్యాచుల్లో 93.57 స‌గ‌టుతో 655 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో ఈ సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. భీక‌ర ఫామ్‌లో ఉన్న య‌శ‌స్వి ధ‌ర్మ‌శాల వేదిక‌గా మార్చి 7 నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టు మ్యాచ్‌కు సిద్ధం అవుతున్నాడు.

కాగా.. ఈ మ్యాచ్‌లో అత‌డు ప‌లు రికార్డుల‌ను అందుకునే అవ‌కాశం ఉంది. ఐదో టెస్టులో య‌శ‌స్వి గ‌నుక ఒక్క ప‌రుగు చేసినా చాలు ఓ అరుదైన రికార్డు అత‌డి ఖాతాలో వ‌చ్చి చేరుతుంది. స్వ‌దేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కుతాడు. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని అధిగ‌మిస్తాడు. కోహ్లితో క‌లిసి ప్ర‌స్తుతం సంయుక్తంగా అగ్ర‌స్థానంలో ఉన్నాడు య‌శ‌స్వి. 2016లో స్వ‌దేశంలో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన 5 మ్యాచుల టెస్టు సిరీస్‌లో 109.16 స‌గ‌టుతో 655 ప‌రుగులు చేశాడు.

మ‌రో 38 ప‌రుగులు చేస్తే..
జైస్వాల్ మ‌రో 38 ప‌రుగులు చేస్తే.. 21వ శ‌తాబ్దంలో ఓ టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిల‌వ‌నున్నాడు. ఈ క్ర‌మంలో ప‌రుగుల యంత్రం కోహ్లి(692)ని అధిగ‌మిస్తాడు

Shreyas Iyer : పురుషుల జ‌ట్టు నుంచి తొల‌గించార‌ని.. మ‌హిళ‌ల లీగ్‌లో అంపైరింగ్ చేస్తున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ ?

భార‌త్ త‌రుపున టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు..
భార‌త్ త‌రుపున ఓ టెస్టు మ్యాచ్ సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డు దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ పేరిట ఉంది. 1970లో విండీస్‌తో సిరీస్‌లో 734 ప‌రుగులు చేశాడు.

– సునీల్ గవాస్కర్ వర్సెస్ వెస్టిండీస్ 1970లో 774 ప‌రుగులు
– సునీల్ గవాస్కర్ వ‌ర్సెస్‌ వెస్టిండీస్ 1978లో 732 ప‌రుగులు
– విరాట్ కోహ్లీ వర్సెస్ ఇంగ్లండ్ 2014లో 692 ప‌రుగులు
– విరాట్ కోహ్లీ వర్సెస్ ఇంగ్లండ్ 2016లో 655 ప‌రుగులు
– యశస్వి జైస్వాల్ వర్సెస్ ఇంగ్లండ్ 2024లో 655 ప‌రుగులు