Shreyas Iyer : పురుషుల జ‌ట్టు నుంచి తొల‌గించార‌ని.. మ‌హిళ‌ల లీగ్‌లో అంపైరింగ్ చేస్తున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ ?

గ‌త కొన్నాళ్లుగా టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ వార్త‌ల్లో ఉంటూ వ‌స్తున్నాడు.

Shreyas Iyer : పురుషుల జ‌ట్టు నుంచి తొల‌గించార‌ని.. మ‌హిళ‌ల లీగ్‌లో అంపైరింగ్ చేస్తున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ ?

Shreyas Iyer - Parashar Joshi

Shreyas Iyer – Parashar Joshi : గ‌త కొన్నాళ్లుగా టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ వార్త‌ల్లో ఉంటూ వ‌స్తున్నాడు. ఇంగ్లాండ్‌తో జ‌రిగిన తొలి రెండు టెస్టు మ్యాచుల్లో అయ్య‌ర్ విఫ‌లం అయ్యాడు. మిగతా బ్యాట‌ర్ల రాణించిన చోట అయ్య‌ర్ రెండు మ్యాచుల్లో క‌లిపి 104 ప‌రుగులే చేసి నిరాశ ప‌రిచాడు. ఈ క్ర‌మంలో మిగిలిన మూడు టెస్టుల‌కు అయ్య‌ర్‌ను ప‌క్క‌న పెట్టారు.

అత‌డిని బీసీసీఐ రంజీ మ్యాచ్‌లు ఆడాల‌ని సూచిస్తే.. త‌న‌కు వెన్నునొప్పి ఉంద‌ని త‌ప్పిచుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ(ఎన్‌సీఏ) వైద్యులు మాత్రం అత‌డికి గ‌ట్టి షాక్ ఇచ్చాడు. మ్యాచ్ ఆడే ఫిట్‌నెస్ అయ్య‌ర్‌కు ఉంది అని బీసీసీఐకి వెల్ల‌డించారు.

ఇదిలా ఉంటే.. మ‌హిళ ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) 2024 సీజ‌న్‌లో గుజ‌రాత్ జెయింట్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ ఉన్న ఫోటో అది. అయితే.. అత‌డిని చూస్తే అచ్చం శ్రేయ‌స్ అయ్య‌ర్ లాగే క‌నిపించాడు.

ICC Test Rankings : రోహిత్ శ‌ర్మ‌కు షాకిచ్చిన య‌శ‌స్వి జైస్వాల్.. త్వ‌ర‌లోనే కోహ్లికి ఎస‌రు?

దీంతో కొంద‌రు పొర‌ప‌డ్డారు. కాసేపు నిశితంగా గ‌మ‌నిస్తే అయ్య‌ర్ కాద‌ని అర్ధం అవుతుంది. ఫోటో వైర‌ల్ కావ‌డంతో.. మ‌నిషిని పోలిన మ‌నుషులు ఏడుగురు ఉంటార‌ని, అయ్య‌ర్‌ను పోలిన వ్య‌క్తి డ‌బ్ల్యూపీఎల్ లో అంపైరింగ్ చేస్తున్న‌డ‌ని ఒక‌రు కామెంట్ చేయ‌గా, పాపం అయ్య‌ర్ పురుషుల జ‌ట్టు నుంచి తొల‌గిస్తే మ‌హిళ‌ల లీగ్‌లో అంపైరింగ్ చేసుకుంటున్నాడ‌ని ఇంకొక‌రు ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Viral Video : డూప్లికేట్ ప్రీమియ‌ర్ లీగ్.. ధోని, కోహ్లి, స‌చిన్‌ల మ‌ధ్య చ‌ర్చ‌.. వీడియో వైర‌ల్‌

కాగా.. స‌ద‌రు అంపైర్ పేరు పరాషర్ జోషి. తన కెరీర్‌లో అత‌డు 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లకు, 17 లిస్ట్ ఏ మ్యాచ్‌లకు, 14 టీ20లకు ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వ‌ర్తించాడు.

ఇక అయ్య‌ర్ విష‌యానికి వ‌స్తే.. రంజీ ట్రోఫీ ఆడ‌కూడ‌నే అయ్య‌ర్ వెన్ను నొప్పి అంటున్నాడ‌ని తెలిసి బీసీసీఐ అత‌డిపై ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అత‌డి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ను ర‌ద్దు చేయాల‌ని భావించిన‌ట్లు వ‌దంతులు వ్యాపించాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అయ్య‌ర్ తాను ఫిట్‌గా ఉన్నాన‌ని, రంజీ ట్రోఫీ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ముంబై త‌రుపున ఆడేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించాడు.